వేధింపులు తాళలేక యువతి ఆత్మహత్య | young woman committed suicide by bullying | Sakshi
Sakshi News home page

వేధింపులు తాళలేక యువతి ఆత్మహత్య

Jun 14 2016 1:57 AM | Updated on Nov 6 2018 7:56 PM

మండలంలో భీంపోలు పంచాయతీ రామచంద్రాపురం గ్రామానికి చెందిన మద్దేల సరోజిని అలియాస్ చిన్ని(22) అనే

అనంతగిరి: మండలంలో భీంపోలు పంచాయతీ రామచంద్రాపురం గ్రామానికి చెందిన మద్దేల సరోజిని అలియాస్ చిన్ని(22) అనే యువతి ఆదివారం పురుగు  మందు తాగి ఆత్మహత్యాకు పాల్పడింది.  తన భర్తతో వివాహేతర సంబంధం ఉందనిఓ మహిళ వేధించడంతో  భరించలేక సరోజిని మనస్తాపం చెంది పురుగు మందు తాగింది.  ఆమెను కుటుంబ సభ్యులు శృంగవరపు కో ట కమ్యూనిటీహెల్త్‌సెంటర్‌కు తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది.  తాను ఆత్మహత్య చేసుకోడానికి గల కారణాలను సరోజిని సూ సైడ్ నోట్‌లో రాసినట్టు అనంతగిరి ఎస్‌ఐ పి.దామోదరనాయుడు తెలి పారు. 


గుమ్మకోటకు చెందిన పెరుమాళ్ళ మహేష్, అతని భార్య గీత,మహేష్ వదిన భవానీ  వివాహేతర సంబంధం పేరుతో తనను వేధింపులకు గురి చేస్తున్నారని, బయటకు తెలిస్తే పరువు పోతుందని ఆత్మహత్య చేసుకున్నట్టు సరోజీని సూసైడ్ నోట్‌లో పేర్కొంది. మృతురాలి తల్లి దేముడమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు విచారణ చేస్తున్నట్టు  ఎస్‌ఐ తెలిపారు.సోమవారం శృంగవరపుకోటసీహెచ్‌ిసీలోమృతదేహానికిపోస్టుమార్టంపరీక్షలు నిర్వహించారు.

Advertisement
 
Advertisement
Advertisement