వెండితెర సరోజిని

Dipika Chikhlia to Play Sarojini Naidu in Biopic Poster Release - Sakshi

స్వాతంత్య్ర సమరయోధురాలు, నైటింగేల్‌ ఆఫ్‌ ఇండియాగా పేరు పొందిన సరోజినీ నాయుడు బయోపిక్‌ తెరకెక్కనుంది. ఈ బయోపిక్‌కు ‘సరోజిని’ అనే టైటిల్‌ ఖరారు చేశారు. హిందీలో ‘రామాయణ్‌’ (1987) టీవీ సీరియల్‌లో సీతగా నటించి, ఇప్పుడు బాలీవుడ్‌ చిత్రాల్లో క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా చేస్తోన్న దీపికా చిఖలియా  టైటిల్‌ రోల్‌ చేయనున్నారు. ఆకాష్‌ నాయక్, ధీరజ్‌ మిశ్రా ద్వయం ఈ బయోపిక్‌కు దర్శకత్వం వహించనున్నారు. ఈ చిత్రాన్ని రాయల్‌ ఫిల్మ్‌ మీడియా సమర్పణలో కాను భాయ్‌ పటేల్‌ నిర్మించనున్నారు. గురువారం ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ను విడుదల చేశారు దీపిక. ‘‘సరోజినీ నాయుడుగా మీ లుక్‌ బాగుంది’’ అంటూ దీపికను చాలామంది అభినందించారు. లాక్‌డౌన్‌ పూర్తయ్యాక ఈ చిత్రం షూటింగ్‌ మొదలు కానుంది.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top