భీమవరంలో యువకుడి దారుణహత్య | Young Mans Murder In Bhimavaram | Sakshi
Sakshi News home page

భీమవరంలో యువకుడి దారుణహత్య

May 9 2018 12:56 PM | Updated on Aug 1 2018 2:31 PM

 Young Mans Murder In Bhimavaram - Sakshi

సాక్షి, భీమవరం : పశ్చిమగోదావరి జిల్లా భీమవరం పట్టణంలో ఓ యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. స్థానిక బ్యాంక్‌ కాలనీలో మంగళవారం అర్ధరాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది.  రొయ్యల కంపెనీలో డ్రైవర్‌గా పనిచేస్తున్న నారిశెట్టి వెంకట సునీల్‌ నలుగురు స్నేహితులతో కలిసి గతరాత్రి మద్యం సేవించాడు.

అనంతరం ఆ నలుగురు కలిసి సునీల్‌పై దాడి చేసి హత్య చేశారు. కాగా పాతకక్షల నేపథ్యంలోనే ఈ హత్య జరిగినట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. స్థానికంగా ఉన్న సీసీఫుటేజీల ఆధారంగా నిందితుల కోసం గాలింపు చేపట్టినట్లు పోలీసులు పేర్కొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement