'ఆ ముగ్గురు కలసి రాష్ట్రాన్ని విభజించి సర్వనాశనం చేశారు' | Yanamala Ramakrishnudu, Palle Raghunatha reddy takes on Congress party | Sakshi
Sakshi News home page

'ఆ ముగ్గురు కలసి రాష్ట్రాన్ని విభజించి సర్వనాశనం చేశారు'

Mar 17 2015 12:22 PM | Updated on Jul 12 2019 6:01 PM

'ఆ ముగ్గురు కలసి రాష్ట్రాన్ని విభజించి సర్వనాశనం చేశారు' - Sakshi

'ఆ ముగ్గురు కలసి రాష్ట్రాన్ని విభజించి సర్వనాశనం చేశారు'

ఆ ముగ్గురు కలిసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని విభజించి సర్వనాశనం చేశారని అప్పటి కేంద్ర మంత్రులు చిదంబరం, షిండే, మొయిలీలపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రులు యనమల రామకృష్ణుడు, పల్లె రఘునాథరెడ్డిలు ఆరోపించారు.

హైదరాబాద్: ఆ ముగ్గురు కలిసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని విభజించి సర్వనాశనం చేశారని అప్పటి కేంద్ర మంత్రులు చిదంబరం, షిండే, మొయిలీలపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రులు యనమల రామకృష్ణుడు, పల్లె రఘునాథరెడ్డిలు మండిపడ్డారు. మంగళవారం అసెంబ్లీలో యనమల, పల్లె మాట్లాడుతూ... ప్రత్యేక హోదాపై కాంగ్రెస్ పార్టీది రెండు నాల్కల ధోరణి అని వారు విమర్శించారు. ప్రత్యేక హోదా... విభజన చట్టంలో పెట్టలేదు, ప్రకటన మాత్రమే చేశారని వారు ఈ సందర్భంగా గుర్తు చేశారు.

ప్రత్యేక హోదాపై కాంగ్రెస్ కొత్త నాటకం మొదలు పెట్టిందని వారు ఎద్దేవా చేశారు. కాంగ్రెస వైఖరి ఏమిటో చెప్పాలని వారు డిమాండ్ చేశారు. రాష్ట్రానికి రాయితీలు అనవసరం అన్న మొయిలీ వ్యాఖ్యలు సరైనవి కావని యనమల, పల్లె అభిప్రాయపడ్డారు. ఎమ్మెల్యేలకు ఇప్పట్లో జీతాలు పెంచే ఆలోచనలు లేవని యనమల, పల్లె స్పష్టం చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement