కేఎన్ఆర్కు నివాళు అర్పించిన జగన్ | Y.S.Jagan mohan reddy pay tributes to K.Nageshwar rao | Sakshi
Sakshi News home page

కేఎన్ఆర్కు నివాళు అర్పించిన జగన్

Nov 22 2013 1:29 PM | Updated on Jul 25 2018 4:09 PM

కృష్ణా జిల్లా జడ్పీ మాజీ చైర్మన్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్రం మండలి సభ్యుడు కె.నాగేశ్వరరావు భౌతిక కాయాన్నిమెవ్వ మండలం కోసూరులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి శుక్రవారం సందర్శించారు.

కృష్ణా జిల్లా జడ్పీ మాజీ చైర్మన్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్రం మండలి సభ్యుడు కె.నాగేశ్వరరావు భౌతిక కాయాన్నిమెవ్వ మండలం కోసూరులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి శుక్రవారం సందర్శించారు. అనంతరం కేఎన్ఆర్కు వైఎస్ జగన్ ఘనంగా నివాళులర్పించారు. కేఎన్ఆర్ కుటుంబసభ్యులను కలసి జగన్ తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. అనంతరం జగన్ మాట్లాడుతూ... కృష్ణాజిల్లా జెడ్పీ చైర్మన్గా కేఎన్ఆర్ చేసిన సేవలను కొనియాడారు. వైఎస్ఆర్ పార్టీలో కేంద్ర మండలి సభ్యునిగా కేఎన్ఆర్ అందిస్తున్న సేవలను జగన్ ఈ సందర్భంగా ప్రస్తుతించారు.

 

శుక్రవారం కేఎన్ఆర్ స్వగ్రామంలో జరిగి అంత్యక్రియల్లో పాల్గొనేందుకు వైఎస్ జగన్ గురువారం రాత్రి మచిలీపట్నం ఎక్స్ప్రెస్లో హైదరాబాద్ నుంచి బయలుదేరిన సంగతి తెలిసిందే. కేఎన్ఆర్ నిన్న ఉదయం మచిలీపట్నంలో తీవ్ర గుండెనెప్పితో మరణించిన సంగతి తెలిసిందే. అయితే కేఎన్ఆర్కు నివాళ్లు అర్పించేందుకు రాష్ట్ర మంత్రి రఘువీరారెడ్డితో పాటు పలువురు ప్రముఖులు కోసూరు చేరుకున్నారు.

Advertisement

Related News By Category

Advertisement
 
Advertisement
Advertisement