breaking news
K.Nageshwar rao
-
కడుపులోనే పరీక్షలూ...పుట్టగానే చికిత్సలు...!
నేడు డాక్టర్స్ డే డాక్టర్ తపన్ దాష్, డాక్టర్ కె. నాగేశ్వరరావు పీడియాట్రిక్ కార్డియోథొరాసిక్ సర్జన్స్, కేర్ హాస్పిటల్స్, హైదరాబాద్ ఆమె మార్కెట్ యార్డులో పనిచేసే ఒక సాధారణ వ్యక్తి భార్య. గర్భవతి. మెదక్ జిల్లా కొండాపూర్‌కు చెందిన అనూరాధ అనే ఆ మహిళ ఎప్పటిలాగే రొటీన్ చెకప్ కోసం ఆసుపత్రికి వచ్చింది. డాక్టర్లు ఆమెను పరీక్షిస్తూ ఒక అసాధారణ అంశాన్ని గమనించారు. ఆమె కడుపులో ఉన్న పాప ‘హార్ట్ ఫెయిల్యూర్’తో చాలా క్రిటికల్ కండిషన్లో ఉంది. ఎలాగైనా పెద్ద ప్రాణాన్నీ, కడుపులోని పసిపాపనూ... ఇద్దర్నీ రక్షించాలని నిర్ణయించుకున్నా డాక్టర్లు. పాప అనూరాధ గర్భంలో ఉండగానే ‘ఫీటల్ ఎకోకార్డియోగ్రఫీ’ అనే పరీక్ష నిర్వహించారు. ఆ పరీక్ష ఫలితం వచ్చింది. పాప ‘అబ్స్ట్రక్టివ్ ఇన్ఫ్రాడయాఫ్రమాటిక్ టోటల్ అనామలస్ పల్మనరీ వీనస్ డ్రయినేజ్’ (టీఏపీవీఆర్) అనే అత్యంత అరుదైన వ్యాధితో తీవ్రంగా బాధపడుతోంది. సాధారణంగా శుద్ధమైన రక్తం ఊపిరితిత్తుల్లో శుభ్రపడి అక్కడ్నుంచి గుండె తాలూకు ఎడమ ఏట్రియమ్‌కు చేరాలి. ఈ కండిషన్లో అది గుండె ఎడమ ఏట్రియమ్‌కు బదులు కాలేయానికి తన దిశ మార్చుకుంటుంది. దాంతో పాపకు ప్రాణాపాయం జరిగే అవకాశం ఉంది. పాప కడుపులో ఉన్నంతసేపు ఎలాగూ బతికేస్తుంది. కానీ పుట్టీ పుట్టగానే పాపలో తనదైన రక్తప్రసరణ వ్యవస్థ మొదలవుతుంది. అయితే ఈ ప్రక్రియలో శుద్ధమైన రక్తం గుండె ఎడమ ఏట్రియమ్‌కు చేరకుండా కాలేయానికి చేరితే శుద్ధమైన రక్తం అందని కారణంగా పాప పుట్టిన కొద్దిసేపట్లోనే చనిపోవచ్చు. అనూరాధకు 2014 జనవరి 4న సిజేరియన్ చేసి కడుపులోంచి పాపను బయటకు తీశారు డాక్టర్లు. ఉదయం గం. 6.45 నిమిషాలకు పుట్టిన పాపను వెంటనే వెంటిలేటర్‌పై ఉంచారు. పుట్టీపుట్టగానే చిన్నారిని అత్యవసరంగా ఆపరేషన్ థియేటరకు తరలించారు. ఉదయం 8.30కి మొదలైన సర్జరీ 11.30 కల్లా విజయవంతంగా ముగిసింది. గంటల పాపపై డాక్టర్ల శస్త్రచికిత్స సత్ఫలితాలిచ్చింది. రక్తనాళాల్లోని రక్తంతో పాటు... మృత్యువూ తన దారి మార్చుకుని, పాప నుంచి దూరంగా వెళ్లింది. ఈ సందర్భంగా తమకు తోడ్పడ్డ డాక్టర్ శ్రీనివాసమూర్తి, డాక్టర్ మాల్జిని, డాక్టర్ పల్లవి, డాక్టర్ విజయ... ఇతర సహాయక సిబ్బంది సేవలను స్మరించారు డాక్టర్ నాగేశ్వరరావు, డాక్టర్ తపన్దాష్. -
కేఎన్‌ఆర్‌కు నివాళు అర్పించిన జగన్
కృష్ణా జిల్లా జడ్పీ మాజీ చైర్మన్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్రం మండలి సభ్యుడు కె.నాగేశ్వరరావు భౌతిక కాయాన్నిమెవ్వ మండలం కోసూరులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి శుక్రవారం సందర్శించారు. అనంతరం కేఎన్‌ఆర్‌కు వైఎస్ జగన్ ఘనంగా నివాళులర్పించారు. కేఎన్ఆర్ కుటుంబసభ్యులను కలసి జగన్ తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. అనంతరం జగన్ మాట్లాడుతూ... కృష్ణాజిల్లా జెడ్పీ చైర్మన్‌గా కేఎన్ఆర్ చేసిన సేవలను కొనియాడారు. వైఎస్ఆర్ పార్టీలో కేంద్ర మండలి సభ్యునిగా కేఎన్ఆర్ అందిస్తున్న సేవలను జగన్ ఈ సందర్భంగా ప్రస్తుతించారు. శుక్రవారం కేఎన్ఆర్ స్వగ్రామంలో జరిగి అంత్యక్రియల్లో పాల్గొనేందుకు వైఎస్ జగన్ గురువారం రాత్రి మచిలీపట్నం ఎక్స్‌ప్రెస్‌లో హైదరాబాద్ నుంచి బయలుదేరిన సంగతి తెలిసిందే. కేఎన్ఆర్ నిన్న ఉదయం మచిలీపట్నంలో తీవ్ర గుండెనెప్పితో మరణించిన సంగతి తెలిసిందే. అయితే కేఎన్‌ఆర్‌కు నివాళ్లు అర్పించేందుకు రాష్ట్ర మంత్రి రఘువీరారెడ్డితో పాటు పలువురు ప్రముఖులు కోసూరు చేరుకున్నారు.