రేపు ప్రణబ్ను కలవనున్న వైఎస్ జగన్మోహనరెడ్డి | Y S Jagan Mohan Reddy is scheduled to meet President Pranab Mukherjee tomorrow | Sakshi
Sakshi News home page

రేపు ప్రణబ్ను కలవనున్న వైఎస్ జగన్మోహనరెడ్డి

Nov 22 2013 8:30 PM | Updated on Jul 25 2018 4:09 PM

రేపు ప్రణబ్ను కలవనున్న వైఎస్ జగన్మోహనరెడ్డి - Sakshi

రేపు ప్రణబ్ను కలవనున్న వైఎస్ జగన్మోహనరెడ్డి

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహనరెడ్డి శనివారం రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కలవనున్నారు.

హైదరాబాద్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహనరెడ్డి శనివారం రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కలవనున్నారు.ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన అంశానికి సంబంధించి ఆయన ప్రణబ్తో భేటీ కానున్నారు. రేపు మధ్యాహ్న 12.30 గం.ల ప్రాంతంలో జగన్మోహనరెడ్డి రాష్ట్రపతితో సమావేశమవుతారు.  ఇదిలా ఉండగా ఎన్సీపీ అధినేత శరద్ పవార్ ను, ఒరిస్సా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ను, జేడీయూ అధినేత శరద్ యాదవ్ తో జగన్ సమావేశమువుతారు. ఆంధ్రప్రదేశ్ ను సమైక్యంగానే ఉంచేందుకు మద్దతు ఇవ్వాలని వారిని కోరనున్నారు. రేపు సాయంత్రం శరద్ యాదవ్ ను కలిసిన అనంతరం, నవీన్ పట్నాయక్ ను కలిసేందుకు భువనేశ్వర్ బయలుదేరి వెళతారు.

 

వైఎస్ జగన్మోహనరెడ్డి ముంబై, భువనేశ్వర్ లు వెళ్లేందుకు సీబీఐ ప్రత్యేక కోర్టు అనుమతినిచ్చిన విషయం తెలిసిందే.   ఈ నెల 23న ఢిల్లీ వెళ్లేందుకు, ఈ నెల 24న భువనేశ్వర్ లో నవీన్ పట్నాయక్ను, ఈ నెల 25న ముంబైలో శరద్ పవార్ ను కలిసేందుకు జగన్ వేర్వేరుగా పిటీషన్లు దాఖలు చేశారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement