కష్టపడిన కార్యకర్తలకు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ తప్పక గుర్తిస్తుందని, అందుకు ప్రత్యక్ష ఉదాహరణ రాష్ట్ర సంయుక్త కార్యదర్శిగా ఎదిగిన ఎంపీ సురేషే
వైఎస్‌ఆర్‌సీపీ నేతలు
కడప కార్పొరేషన్: కష్టపడిన కార్యకర్తలకు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ తప్పక గుర్తిస్తుందని, అందుకు ప్రత్యక్ష ఉదాహరణ రాష్ట్ర సంయుక్త కార్యదర్శిగా ఎదిగిన ఎంపీ సురేషే అని ఎమ్మెల్యేలు పి.రవీంద్రనాథ్‌రెడ్డి, ఎస్‌బీ అంజద్‌బాషా, మేయర్ కె.సురేష్‌బాబు అన్నారు. రాష్ట్ర కమిటీలో ఎంపీ సురేష్‌కు స్థానం లభించిన సందర్భంగా శనివారం స్థానిక పార్టీ కార్యాలయంలో కేక్ కట్ చేశారు. అనంతర ం పార్టీ నాయకులు ఆయనను ఘనంగా సన్మానించారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యేలు, మేయర్ మాట్లాడుతూ ఎంపీ సురేష్ మంచి వాక్చాతుర్యం కలిగిన వాడని, పార్టీ ఆధ్వర్యంలో చేసిన ఆందోళన కార్యక్రమాలు, దీక్షలలో ఆయన నిర్వహించిన పాత్ర మరువలేనిదన్నారు.
కష్టపడిన వ్యక్తులను పార్టీ ఎన్నటికీ మరిచిపోదన్నారు. అందుకే ఎంపీ సురేష్‌ను పార్టీ జిల్లా అధ్యక్షుడు అమర్‌నాథ్‌రెడ్డి, ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి, ఎమ్మెల్యేలందరూ ప్రతిపాదించారని గుర్తు చేశారు. అనంతరం ఎంపీ సురేష్ మాట్లాడుతూ తనకు పదవులు రావడానికి కారణమైన వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి, ఎంపీ, ఎమ్మెల్యేలు, పార్టీ జిల్లా అధ్యక్షునికి కృత జ్ఞతలు తెలిపారు. రెట్టించిన ఉత్సాహంతో పని చేసి పార్టీని మరింత బలోపేతం చేస్తానని చెప్పారు.
కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ బి.అరీఫుల్లా, అనుబంధ విభాగాల అధ్యక్షులు పులి సునీల్‌కుమార్, నిత్యానందరెడ్డి, వేణుగోపాల్‌నాయక్, కరిముల్లా, చల్లా రాజశేఖర్, ఎస్‌ఎండీ షఫీ, ఎం. వెంకటేష్, కార్పొరేటర్లు సాయిచరణ్, బండిప్రసాద్, కో ఆప్షన్ సభ్యుడు నాగమల్లారెడ్డి, నాయకులు నాగిరెడ్డి ప్రసాద్‌రెడ్డి, బాలస్వామిరెడ్డి, జి.క్రిష్ణ తదితరులు పాల్గొన్నారు.