అనంతపురం జిల్లా ధర్మవరం పట్టణానికి చెందిన బాలాజీ (35) అనే చేనేత కార్మికుడు అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్నాడు.
ధర్మవరం (అనంతపురం): అనంతపురం జిల్లా ధర్మవరం పట్టణానికి చెందిన బాలాజీ (35) అనే చేనేత కార్మికుడు అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషయం సోమవారం వెలుగు చూసింది. బంధువుల కథనం మేరకు.. స్థానిక శివానగర్‌కు చెందిన బాలాజీ రెండు మగ్గాలను నడుపుకుంటూ జీవనం సాగించేవాడు. పెరిగిన ముడిపట్టు ధరల కారణంగా మూడేళ్లుగా మగ్గాల నిర్వహణలో నష్టాలు రావడంతో రూ.4 లక్షల వరకు అప్పులు చేశాడు.
దీంతో కుటుంబ పోషణ భారమైంది. రుణదాతల ఒత్తిళ్లు అధికమవడంతో ఆదివారం ఇంట్లో నుంచి వెళ్లిపోయాడు. స్థానిక కేశవనగర్‌లోని తన పాత ఇంట్లో ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషయం సోమవారం సాయంత్రం వెలుగు చూసింది. బాలాజీకి భార్య హారిక, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు.