హైదరాబాద్‌పై గవర్నర్ పాలనకు అంగీకరించబోమని టీఎన్‌జీవో అధ్యక్షుడు దేవీప్రసాద్ చెప్పారు. కేంద్రపాలిత ప్రాంతంగానూ ఒప్పుకునేది లేదన్నారు.
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌పై గవర్నర్ పాలనకు అంగీకరించబోమని టీఎన్‌జీవో అధ్యక్షుడు దేవీప్రసాద్ చెప్పారు. కేంద్రపాలిత ప్రాంతంగానూ ఒప్పుకునేది లేదన్నారు. సచివాలయంలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఉద్యోగుల హెల్త్ కార్డులకు సంబంధించిన జీవోలో లోపాలు సరిచేయాల్సిందిగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ప్రసన్నకుమార్ మహంతిని కలసి విన్నవించినట్లు తెలిపారు. ఓయూ ఉద్యోగులు, మార్కెట్ కమిటీ ఉద్యోగులు, ఎయిడెడ్ ఉద్యోగులకు కూడా హెల్త్‌కార్డులు వర్తింపజేయాలని సీఎస్‌కు విజ్ఞప్తి చేసినట్లు చెప్పారు.
ఒప్పుకోం: శ్రీనివాస్‌గౌడ్
హైదరాబాద్‌లో శాంతిభద్రతల పర్యవేక్షణను గవర్నర్ చేతిలో పెడితే సహించేది లేదని తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం అధ్యక్షుడు శ్రీనివాసగౌడ్ పేర్కొన్నారు. స్వయంపరిపాలన కోరుకుంటున్న తమకు ఈ ప్రతిపాదన ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని, అలాంటి పాలన ఒక్క రోజు ఉన్నా కూడా సహించబోమని స్పష్టంచేశారు. శుక్రవారం జరిగిన టీజీవో క్యార్యవర్గ సమావేశంలో 12 అంశాలపై తీర్మానాలను ఆమోదించారు.