నగరంలోని భవానీపురంలో జనావాసాల మధ్య ఏర్పాటు చేసిన మద్యం దుకాణంలోని మద్యం సీసాలను మహిళలు ధ్వంసం చేసి నిరసన వ్యక్తం చేశారు.
ఒక్కసారిగా దుకాణంలోకి వెళ్లి మద్యం సీసాలను పగులగొట్టారు. అనంతరం వైన్ షాప్ ఎదుట ధర్నాకు దిగారు. ఈ సందర్భంగా మద్యం దుకాణంలో దాడికి పాల్పడ్డారనే ఆరోపణలపై పలువురు మహిళలపై భవానీపురం పోలీసులు కేసులు నమోదు చేశారు.