'అర్జున్‌ రెడ్డి' పై మహిళల ఆగ్రహం | Women Leaders Protest Against Arjun Reddy movie | Sakshi
Sakshi News home page

'అర్జున్‌ రెడ్డి' పై మహిళల ఆగ్రహం

Aug 31 2017 4:27 PM | Updated on Sep 17 2017 6:12 PM

'అర్జున్‌ రెడ్డి' పై మహిళల ఆగ్రహం

'అర్జున్‌ రెడ్డి' పై మహిళల ఆగ్రహం

‘అర్జున్ రెడ్డి’ సినిమా ప్రదర్శనను నిలిపివేయాలంటూ మహిళా సంఘాలు ఆందోళనకు దిగాయి.

విజయవాడ: ‘అర్జున్ రెడ్డి’ సినిమా ప్రదర్శనను నిలిపివేయాలంటూ విజయవాడలో మహిళా సంఘాలు ఆందోళనకు దిగాయి. నగరంలోని గాంధీనగర్ లో అర్జున్ రెడ్డి సినిమా ప్రదర్శిస్తున్న థియేటర్ల వద్ద ఏపీ మహిళా సమాఖ్య, మహిళా కాంగ్రెస్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు.
 
థియేటర్ ల ముందు కట్డిన ఫ్లెక్సీలను చించివేశారు. అశ్లీలత, అసభ్యతతో కూడిన ఈ సినిమాను తక్షణం నిషేధించాలని డిమాండ్ చేశారు. ఆందోళన నిర్వహిస్తున్న ఏపీ మహిళా సమాఖ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుర్గాభవాని సహా పలువురు మహిళలను పోలీసులు అదుపులోకి తీసుకుని, స్టేషన్ కు తరలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement