
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన బ్రాహ్మణుల ఆత్మీయ సమ్మేళనంలో ఓ మహిళ మాట్లాడిన మాటలు అందరినీ కదిలించాయి.
సాక్షి, విశాఖపట్నం: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సోమవారం నిర్వహించిన బ్రాహ్మణుల ఆత్మీయ సమ్మేళనంలో కర్నూలు చెందిన ఓ మహిళ మాట్లాడిన మాటలు అందరినీ కదిలించాయి. దివంగత మహానేత వైఎస్సార్ రాజశేఖరరెడ్డి, చంద్రబాబు నాయుడు వ్యవహారశైలి గురించి వాస్తవాన్ని ఆమె వెల్లడించారు. బ్రాహ్మణుల ఆత్మీయ సమ్మేళనంలో ఆమె మాట్లాడిన వీడియోను ఇప్పుడు సోషల్ మీడియాలో అందరూ ఆసక్తిగా వీక్షిస్తున్నారు.
ఆమె ఏమన్నారంటే.. ‘గతంలో రాజశేఖరరెడ్డి గారి హయాంలో ఒక క్యాన్సర్ రోగి ఆపరేషన్ కోసం ఆర్థిక సాయం చేయాలని అడిగితే రెండు లక్షల రూపాయలు మంజూరు చేశారు. ఆపరేషన్ అయి కోలుకున్నాక వైఎస్సార్‌ను కలిసి కాళ్లకు నమస్కారం పెడుతుంటే తప్పు.. మీరు బ్రాహ్మణులు. మాకు నమస్కారం పెట్టకూడదు. మేమే మీకు పెట్టాలని అన్నారు. అదే చంద్రబాబునాయుడు బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ ఆనందసూర్య చేత తన కాళ్లకు నమస్కారం పెట్టించుకున్నాడు. వైఎస్‌కు, చంద్రబాబుకు ఉన్న తేడా అదే’