కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మండలం కోటిలింగాల వద్ద అటవీ ప్రాంతంలో ఓ యువతి అనుమానాస్పద స్థితిలో మృతి చెందగా..
అడవిలో యువతి అనుమానాస్పద మృతి
Feb 27 2016 2:25 PM | Updated on Sep 3 2017 6:33 PM
మేళ్లచెర్వు: కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మండలం కోటిలింగాల వద్ద అటవీ ప్రాంతంలో ఓ యువతి అనుమానాస్పద స్థితిలో మృతి చెందగా శనివారం ఉదయం వెలుగు చూసింది. మృతి చెందిన యువతి నల్లగొండ జిల్లా మేళ్లచెర్వు మండలం బుగ్గమాదారం గ్రామానికి చెందిన ఆవుల త్రివేణి(19)గా గుర్తించారు. త్రివేణి గత ఆదివారం ఇంటి నుంచి వెళ్లిపోయినట్టు సమాచారం. కోటి లింగాల వద్ద అటవీ ప్రాంతంలో మృతదేహం చెట్టుకు వేలాడుతూ కనిపించడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. హత్యచేసి ఉంటారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
Advertisement


