నా బిడ్డకు ప్రాణభిక్ష పెట్టండి

Woman Sharing Her Sorrow To MLA Peddi Reddy Chittoor - Sakshi

ఎమ్మెల్యే పెద్దిరెడ్డికి  ఓ తల్లి వేడుకోలు

రొంపిచెర్ల: ‘మతిస్థిమితం లేని నా బిడ్డకు ప్రాణ భిక్ష పెట్టండి’ అంటూ రొంపిచెర్ల మండలం గానుగచింత గ్రామ పంచాయతీ దాసరిగుడెంకు చెందిన ఓ తల్లి పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి బుధవారం మొరపెట్టుకుంది. బాధితుల కథనం మేరకు వివరాలు.. దాసరి గూడెంకు చెంది న కె.ప్రతాప్, కుమారి దంపతుల కుమారుడు గణేష్‌(3)కు 45 రోజుల కిందట మెదడువాపు జ్వరం వచ్చింది. దీంతో తల్లిదండ్రులు తిరుపతిలోని ప్రయివేటు ఆస్పత్రులలో సుమారు రూ.2 లక్షలు ఖర్చు చేసి చికిత్సలు చేయించారు. అయితే జ్వరం తీవ్ర ప్రభావం చూపడంతో చిన్నారికి పూర్తిగా మతిస్థిమితం లేకుండా పోయిందని వైద్యులు తెలిపారు. చైన్నైలో ఆపరేషన్‌ చేయించుకోవాలని, అందుకు లక్షల్లో ఖర్చవుతుందని డాక్టర్లు స్పష్టం చేశారు.

దీంతో ప్రస్తుతం చేతిలో డబ్బు లేక బిడ్డను కాపాడుకోలేక చిత్రవధ అనుభవిస్తున్నామని గ్రామంలో పర్యటించిన ఎమ్మెల్యే రామచంద్రారెడ్డికి తన కుమారుడికి ప్రాణ భిక్ష పెట్టాలని వేడుకొన్నారు. స్పందించిన పెద్దిరెడ్డి చిన్నారి ఆపరేషన్‌కు తన వంతు ఆర్థికసాయం హామీ ఇచ్చారు. చిన్నారిని స్విమ్స్‌ ఆస్పత్రికి తీసుకెళ్లి వైద్య పరీక్షలు చేయించాలని తల్లిదండ్రలకు సూ చించారు. అక్కడ డాక్టర్లతో తాను మాట్లాడి తక్కువ ఖర్చుతో ఆపరేషన్‌ చేసేలా చర్యలు తీసుకోంటామని ఎమ్మెల్యే భరోసా ఇచ్చా రు. గణేష్‌ ఆరోగ్య పరిస్థితిపై ఎప్పుటికప్పు డు తనకు తెలియజేయాలని సర్పంచ్‌ జయరామయ్య, ఎంపీటీసీ బాబును ఎమ్మెల్యే ఆదేశించారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top