చోరీకి యత్నం, పీఎస్లో ఆత్మహత్యాయత్నం | woman held for chain snatching in venukonda bustand | Sakshi
Sakshi News home page

చోరీకి యత్నం, పీఎస్లో ఆత్మహత్యాయత్నం

Dec 6 2014 10:08 AM | Updated on Aug 21 2018 5:46 PM

చోరీకి పాల్పడిన ఓ మహిళ పోలీస్ స్టేషన్లో శనివారం ఆత్మహత్యాయత్నం చేసింది.

గుంటూరు : చోరీకి పాల్పడిన ఓ మహిళ పోలీస్ స్టేషన్లో శనివారం ఆత్మహత్యాయత్నం చేసింది. వివరాల్లోకి వెళితే గుంటూరు జిల్లా వినుకొండ బస్టాండ్లో బస్సు కోసం వేచి ఉన్న  ప్రయాణికురాలి మెడలోని బంగారు గొలుసు చోరీకి యత్నించిందో ఓ మహిళ. ఇంతలో బాధిత మహిళ గట్టిగా అరవటంతో అప్రమత్తమైన స్థానికులు ...చోరికి యత్నించిన మహిళను పట్టుకుని దేహశుద్ది చేశారు. అనంతరం ఆమెను పోలీసులకు అప్పగించారు. నిందితురాలు పోలీస్ స్టేషన్లో గొంతు కోసుకుని ఆత్మహత్య చేసుకునేందుకు ప్రయత్నించగా చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
 

Advertisement
 
Advertisement
Advertisement