నంద్యాలలో మహిళపై సామూహిక అత్యాచారం | Woman gangraped in Nadyala town | Sakshi
Sakshi News home page

నంద్యాలలో మహిళపై సామూహిక అత్యాచారం

Jun 21 2014 9:49 AM | Updated on Sep 2 2017 9:10 AM

నంద్యాలలో మహిళపై సామూహిక అత్యాచారం

నంద్యాలలో మహిళపై సామూహిక అత్యాచారం

కర్నూలు జిల్లా నంద్యాలలో దారుణం చోటు చేసుకుంది. నంద్యాల సమీపంలోని శాంతిరాం కళాశాల వద్ద ఓ యువతిపై కొంత మంది యువకులు సామూహిక అత్యాచారం చేశారు.

కర్నూలు జిల్లా నంద్యాలలో దారుణం చోటు చేసుకుంది.  ఓ మహిళపై కొందరు దుండగులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. శాంతిరాం కాలేజ్ దగ్గర కూలీ పనులకు వెళ్లిన మహిళపై దుండగులు ఈ దారుణానికి పాల్పడినట్లు తెలుస్తోంది. రాత్రంతా మహిళపై వేధింపులకు పాల్పడ్డ దుండగులు శాంతిరామ్ కాలేజ్ రోడ్డుపై పడేసి వెళ్లిపోయారు.

ఉదయాన్నే పొలం పనులకు వెడుతున్న స్ధానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. 108 ద్వారా ఆమెను నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బాధితురాలి ఆరోగ్యపరిస్థితి నిలకడగానే ఉన్నట్లు వైద్యులు చెబుతున్నారు. మరిన్ని వైద్యపరీక్షలు నిర్వహించాల్సి ఉందని అంటున్నారు.


ఆ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు పోలీసులు వెల్లడించారు. కాగా బాధితురాలు స్వస్థలం ఖమ్మం జిల్లా అని తన పేరు ఉషారాణి అని వెల్లడించిందని పోలీసులు తెలిపారు.
 

Advertisement
 
Advertisement
Advertisement