అప్పుల బాధ భరించలేక మహిళా రైతు ఆత్మహత్య చేసుకున్న సంఘటన కర్నూలు జిల్లా కౌటాలం మండలంలో ఆదివారం చోటుచేసుకుంది.
కౌటాలం (కర్నూలు) : అప్పుల బాధ భరించలేక మహిళా రైతు ఆత్మహత్య చేసుకున్న సంఘటన కర్నూలు జిల్లా కౌటాలం మండలంలో ఆదివారం చోటుచేసుకుంది. స్థానికంగా నివాసముంటున్న రంజానమ్మ(46) తనకున్న ఏడెకరాల భూమిలో ఐదెకరాలలో పత్తి, మరో రెండెకరాలలో మిర్చి సాగు చేసింది.
ఈ క్రమంలో పంటల పెట్టుబడుల కోసం తెచ్చిన అప్పులు పెరిగిపోవడంతో.. మనస్తాపానికి గురై ఇంట్లో ఎవరూ లేని సమయంలో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.