గడ్డి మోపునకు విద్యుత్ తీగలు తగిలి... | woman died due to electric shock in giddalur | Sakshi
Sakshi News home page

గడ్డి మోపునకు విద్యుత్ తీగలు తగిలి...

Dec 3 2015 2:57 PM | Updated on Sep 5 2018 2:26 PM

ప్రకాశం జిల్లాలో విద్యుత్ తీగలు తగిలి మహిళ మృతి చెందింది.

గిద్దలూరు: ప్రకాశం జిల్లాలో విద్యుత్ తీగలు తగిలి మహిళ మృతి చెందింది. గిద్దలూరు మండలం ఉయ్యాలవాడ గ్రామంలో గురువారం మధ్యాహ్నాం తలపై మోసుకు వస్తున్న గడ్డి మోపునకు తక్కువ ఎత్తులో ఉన్న కరెంటు తీగలు తగిలి షేక్ చాంద్‌బీ(35) అనే మహిళ అక్కడికక్కడే మృతిచెందింది. విద్యుత్ అధికారుల నిర్లక్ష్యమే మహిళ మృతికి కారణమైందని గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మహిళ మృతితో గ్రామంలో విషాదం నెలకొంది.
 

Advertisement
 
Advertisement
Advertisement