కావేరి ట్రావెల్స్ బస్సు బోల్తా, మహిళ మృతి | woman die as Kaveri travels bus slips off road near Singarayakonda | Sakshi
Sakshi News home page

కావేరి ట్రావెల్స్ బస్సు బోల్తా, మహిళ మృతి

Nov 19 2013 10:11 AM | Updated on Sep 2 2017 12:46 AM

బస్సు డ్రైవర్ అతి వేగానికి ఒక మహిళ మృతి చెందగా, పదిమంది వరకూ గాయపడ్డారు.

సింగరాయకొండ : వరుస రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నా .. ప్రైవేటు బస్సుల స్పీడ్‌కు అధికారులు బ్రేక్ వేయలేకపోతున్నారు. ఫలితంగా ప్రకాశం జిల్లాలో మరో ప్రమాదం జరిగింది. బస్సు డ్రైవర్ అతి వేగానికి ఒక మహిళ మృతిచెందగా, పదిమంది వరకూ గాయపడ్డారు. హైదరాబాద్ నుంచి నెల్లూరుకు జెట్ స్పీడ్‌తో వెళ్తున్న కావేరీ ట్రావెల్స్ బస్సు సింగరాయకొండ దాటి వెళ్తుండగా అదుపు తప్పి బోల్తాపడింది. వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి కారణమైన బస్సు డ్రైవర్‌ను అదుపులోకి తీసుకుని, కేసు నమోదు చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement