తనకు కేటాయించిన ఇందిరమ్మ నివేశన స్థలాన్ని కొందరు నేతలు ఆక్రమించారని, అధికారులకు ఎన్నిసార్లు విన్నవించినా ప్రయోజనం లేదని ఒక మహిళ సోమవారం ఉదయం ఏలూరు కలెక్టరేట్‌లో ఆత్మహత్యాయత్నం చేసింది.
కలెక్టరేట్‌లో మహిళ ఆత్మహత్యాయత్నం
Dec 14 2015 12:25 PM | Updated on Sep 3 2017 1:59 PM
ఏలూరు: తనకు కేటాయించిన ఇందిరమ్మ నివేశన స్థలాన్ని కొందరు నేతలు ఆక్రమించారని, అధికారులకు ఎన్నిసార్లు విన్నవించినా ప్రయోజనం లేదని ఒక మహిళ సోమవారం ఉదయం ఏలూరు కలెక్టరేట్‌లో ఆత్మహత్యాయత్నం చేసింది. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు నగరంలోని చిట్టెమ్మ దిబ్బ ప్రాంతానికి చెందిన పార్వతమ్మకు దివంగతనేత వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇందిరమ్మ నివేశన స్థలాన్ని మంజూరు చేశారు.
ప్రస్తుతం ఆ స్థలాన్ని టీడీపీ నేతలు ఆక్రమించారు. ఈ విషయమై అధికారులకు ఎన్నిసార్లు విన్నవించినా ప్రయోజనం లేదు. దాంతో విసిగిపోయిన ఆమె ఈరోజు ఉదయం గ్రీవెన్స్ డే సందర్భంగా కలెక్టరేట్‌కు వచ్చింది. అక్కడ వెంట తెచ్చుకున్న పురుగుల మందు తాగేందుకు ప్రయత్నించగా గమనించిన పోలీసులు అడ్డుకున్నారు. సదరు మహిళతో అధికారులు మాట్లాడేందుకు చర్యలు తీసుకున్నారు.
Advertisement
Advertisement