తూర్పు గోదావరి జిల్లాలో దారుణం జరిగింది. రాజమండ్రి రాజేంద్రనగర్‌లో ఓ మహిళ సజీవ దహనమైంది.
రాజమండ్రి : తూర్పు గోదావరి జిల్లాలో దారుణం జరిగింది. రాజమండ్రి రాజేంద్రనగర్‌లో ఓ మహిళ సజీవ దహనమైంది. నిత్యం రద్దీగా వుండే నడిరోడ్డుమీద ఈ ఘటన జరగడం సంచలనంగా మారింది. మృతురాలిని... పిఠాపురం మండలం గెద్దనాపల్లికి చెందిన డి.కుమారిగా గుర్తించారు. ఐదేళ్ల క్రితం ఆమె కుటుంబం రాజమండ్రి వలస వచ్చి.. ఓ అపార్ట్‌మెంట్‌లో వాచ్‌మెన్‌గా జీవనం సాగిస్తోంది. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.