సమాజానికి నక్సలైట్లు ఏ విధంగానూ ఉపయోగపడరని ఎస్పీ వి.శివకుమార్ అన్నారు. పోలీసులతో నక్సలిజం పారిపోలేదని, సమాజ తిరస్కరణతోనే పొరుగు రాష్ట్రాలకే కార్యకలాపాలు పరిమితం చేశారని అన్నారు.
లింగంపేట(చందుర్తి), న్యూస్‌లైన్ : సమాజానికి నక్సలైట్లు ఏ విధంగానూ ఉపయోగపడరని ఎస్పీ వి.శివకుమార్ అన్నారు. పోలీసులతో నక్సలిజం పారిపోలేదని, సమాజ తిరస్కరణతోనే పొరుగు రాష్ట్రాలకే కార్యకలాపాలు పరిమితం చేశారని అన్నారు. చందుర్తి మండలం లింగంపేట శివారులో.. నక్సల్స్ దాడుల్లో ప్రాణాలు కోల్పోయిన పోలీసులు, ప్రజలస్మృతికి చిహ్నంగా నిర్మించిన స్మారక స్తూపాన్ని గురువారం సాయంత్రం ఎస్పీ, ఓఎస్డీ సుబ్బారాయుడులు ఆవిష్కరించారు.
అనంతరం అమరవీరుల ఆత్మశాంతి కోసం మౌనం పాటించారు. ఎస్పీ శివకుమార్ మాట్లాడుతూ, అమాయకులను ఇన్ఫార్మర్ల పేరుతో బలితీసుకుంటూ మావోయిస్టులు ఉనికి చాటుకుంటున్నారని విమర్శించారు. నక్సల్స్ ఘాతుకాలకు బలైన ఎందరో పోలీసుల కుటుంబాలు వీధినపడ్డాయన్నారు. వనజీవనాన్ని గడుపుతున్న నక్సలైట్లను ఆలోజింపజేసేందుకు సారంగపూర్ మండలం బీర్‌పూర్‌లో అంతర్మథనం కార్యక్రమం నిర్వహించామని, వారు జనజీవన స్రవంతిలో కలిస్తే తాము ఆదుకుంటామని చెప్పారు. నక్సల్స్ తప్పిదాల ఫలితంగానే గ్రామాల్లో అభివృద్ధి నిలిచిపోయిందని విమర్శిం చారు. ప్రజల సహకారంతో పోలీసులం ఏమైనా సాధిస్తామన్నారు.
బడుగు, బలహీన వర్గాల యువతకు ఉపాధి కల్పించాలనే పోలీసుభరోసా కార్యక్రమాన్ని ఏర్పాటు చేశామయని పేర్కొన్నారు. ఓఎస్డీ సుబ్బారాయుడు మాట్లాడుతూ, హింసావాదులను తరిమికొట్టి, అభివృద్ధి కి చేయూతనందించే బాధ్యత ప్రతి పౌరునిపై ఉందన్నా రు. మందపాతరకు బలైన ఎస్సై శ్రీనివాస్‌రావు భార్య సుజాత, నక్సల్స్ హింసాత్మక సంఘటనల్లో మృతి చెంది న వారి కుటుంబాలు, డీఎస్పీలు డి. నర్సయ్య, వేణుగోపాల్‌రావు, సీఎన్‌రెడ్డి, పరమేశ్వర్‌రెడ్డి, సీఐలు శ్రీనివాస్, నాగేంద్రాచారి, రంగయ్యగౌడ్, దేవారెడ్డిలు, ఎస్సైలు ప్రతాప్, మాలకొండరాయుడు, కనుకయ్య ఉన్నారు.