ఆంధ్రప్రదేశ్‌లో అప్రజాస్వామిక పాలన కొనసాగుతోందని విజయవాడ నగర వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వెల్లంపల్లి శ్రీనివాస్ అన్నారు.
న్యాయపోరాటం చేస్తాం: వెల్లంపల్లి
Mar 3 2017 12:42 PM | Updated on May 29 2018 4:37 PM
విజయవాడ: ఆంధ్రప్రదేశ్‌లో అప్రజాస్వామిక పాలన కొనసాగుతోందని విజయవాడ నగర వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వెల్లంపల్లి శ్రీనివాస్ అన్నారు. నిరసన తెలిపినందుకు తమపై అక్రమ కేసులు బనాయించారని చెప్పారు. ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే హక్కు ప్రతి ఒక్కరికి ఉంటుందని గుర్తు చేశారు. పశువులను తరలించినట్లు తమను పోలీసుల వ్యాన్లో తరలించారని చెప్పారు.
గురువారం రాత్రి 10గంటల వరకూ స్టేషన్‌లోనే నిర్బంధించారని తెలిపారు. ప్రభుత్వం వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి, తమపై పెట్టిన అక్రమ కేసులను వెంటనే ఉపసంహరించాలని డిమాండ్ చేశారు. కేసులకు భయపడేది లేదని న్యాయపోరాటం చేస్తామని చెప్పారు.
Advertisement
Advertisement