పంచాయతీ కార్యదర్శుల నియామకాల ప్రక్రియలో పూర్తి పారదర్శకతగా పాటిస్తామని కలెక్టర్ బి.శ్రీధర్ ఒక ప్రకటనలో తెలిపారు.
పంచాయతీ కార్యదర్శుల నియామకాల్లో పారదర్శకత పాటిస్తాం: కలెక్టర్ శ్రీధర్
సాక్షి, రంగారెడ్డి జిల్లా: పంచాయతీ కార్యదర్శుల నియామకాల ప్రక్రియలో పూర్తి పారదర్శకతగా పాటిస్తామని కలెక్టర్ బి.శ్రీధర్ ఒక ప్రకటనలో తెలిపారు. ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ ఎవరైనా మధ్యవర్తులు, దళారులు చెప్పే మాటలు నమ్మవద్దని, వారికి డబ్బులిచ్చి మోసపోవద్దని ఆయన ఈ సందర్భంగా సూచించారు. డబ్బు వసూలు చేస్తునట్లు తెలిస్తే వెంటనే తమకు సమాచారం ఇవ్వాలని, అక్రమార్కులపై కఠిన చర్యలు తీసుకుంటామని, అదేవిధంగా క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని ఆయన హెచ్చరించారు. అభ్యర్థుల డిగ్రీ మార్కులు, వెయిటేజీ మార్కుల ఆధారంగానే నియామకాలు చేపడతామన్నారు. ఎంపిక విధానం, అభ్యర్థుల వివరాలను ఆన్‌లైన్లో అందుబాటులో ఉంచుతామన్నారు. కాగా స్థానిక జిల్లా పరిషత్ కార్యాలయంలో గురువారం పంచాయతీ కార్యదర్శి పోస్టుల కోసం వచ్చిన దరఖాస్తులను అధికారులు పరిశీలించారు.