న్యాయం కోసం.. భర్త ఇంటి ఎదుట ధర్నా


తిరుపతి: న్యాయం కోసం.. భర్త ఇంటి ఎదుట భార్య భైఠాయించిన ఘటన తిరుపతిలోని రేణిగుంట రోడ్డు వద్ద పద్మావతీనగర్లో శుక్రవారం చోటుచేసుకుంది.  న్యాయం కోసం మూడేళ్ల కొడుకుతో కలిసి ఆమె ధర్నాకు దిగింది. వివరాల్లోకి వెళితే.. 2010లో భాస్కర్రాజు, రాధికలు ప్రేమవివాహం చేసుకున్నారు. వీరికి మూడేళ్ల కొడుకు ఉన్నాడు.అయితే 5 నెలల కిందట భాస్కర్ రెండో పెళ్లి చేసుకున్నాడంటూ రాధిక ఆరోపిస్తోంది. తాను ఉండగానే భర్త మరో పెళ్లి చేసుకున్నాడని.. తనకు న్యాయం చేయాలంటూ భర్త ఇంటి ఎదుట భైఠాయించింది. రాధికకు మద్దతుగా మహిళ సంఘాలు కూడా ముందుకు వచ్చాయి. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top