అనుమానంతో భార్య హత్య | wife murder for husband | Sakshi
Sakshi News home page

అనుమానంతో భార్య హత్య

Mar 1 2014 2:47 AM | Updated on Sep 2 2017 4:12 AM

అనుమానంతో భార్య హత్య

అనుమానంతో భార్య హత్య

పాతపట్నం : అనుమానంతో భార్యను దారుణంగా హత్య చేసిన సంఘటన మండలంలోని బూరగాం గ్రామంలో జరిగింది. వివరాల్లోకి వెళితే.. బూరగాం గ్రామంలో యర్లంకి దుర్గారావు కూలి పని చేస్తుంటాడు.

 పాతపట్నం  : అనుమానంతో భార్యను దారుణంగా హత్య చేసిన సంఘటన మండలంలోని బూరగాం గ్రామంలో జరిగింది. వివరాల్లోకి వెళితే.. బూరగాం గ్రామంలో యర్లంకి దుర్గారావు కూలి పని చేస్తుంటాడు.

 

మద్యానికి బానిస కావడంతో దుర్గారావుకు, అతని భార్య సుశీల (30)కు మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవి.  కొంతకాలంగా భార్యపై  అనుమానంతో ఉన్న అతను శుక్రవారం  ఇంట్లో భార్యపై గొడ్డలితో దాడి చేసి హత్య చేశాడు.

 

 మృతదేహాన్ని సమీపంలో గల పొలాల్లో పడేసి వరిగడ్డితో కప్పేశాడు. అతను అక్కడ సంచరిస్తుండడంతో స్థానికులు అనుమానించడంతో హత్య ఉదంతం వెలుగులోకి వచ్చింది. సుశీల హత్య ఉదంతం తెలియడంతో దిగ్భ్రాంతికి గురయ్యారు. స్థానికులు సమాచారం ఇవ్వడంతో పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు.

వారి కుమార్తె చిట్టెమ్మ ఏడాదిన్నర కిందట మృతి చెందింది. కుమారుడు పెంటయ్య ఉన్నాడు.  నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.  కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై బి.సురేష్‌బాబు తెలిపారు.
 
 

Advertisement
 
Advertisement
Advertisement