మహిళతో సహజీవనం.. భర్తకు దేహశుద్ధి | wife caught husband red handed with his girlfriend | Sakshi
Sakshi News home page

మరో మహిళతో సహజీవనం.. భర్తకు దేహశుద్ధి

Nov 6 2017 4:26 PM | Updated on Nov 6 2017 4:36 PM

కట్టుకున్న భార్యను పుట్టింటికి పంపి.. తనతో పాటు పనిచేస్తున్న మరో ఉద్యోగినితో సహజీవనం చేస్తున్న భర్తను.. భార్య రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుంది.

సాక్షి, విజయనగరం : కట్టుకున్న భార్యను పుట్టింటికి పంపి.. తనతో పాటు పనిచేస్తున్న మరో ఉద్యోగినితో సహజీవనం చేస్తున్న భర్తను.. భార్య రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుంది. ఈ సంఘటన విజయనగరం పట్టణంలోని పద్మావతి నగర్ వసంతవిహార్ టౌన్ షిష్‌లో సోమవారం జరిగింది. స్థానికంగా నివాసముంటున్న వినోద్‌కుమార్‌, సునీత భార్య భర్తలు.

ఏడాదిగా భార్యను పుట్టింటిలో వదిలిన వినోద్‌.. పెళ్లైన మరో మహిళతో సహజీవనం చేస్తున్నాడు. భర్తపై అనుమానంతో ఆరా తీసిన భార్యకు అసలు విషయం తెలిసింది. దీంతో సునీత మహిళా సమాఖ్య సభ్యులతో కలిసి ఇంటి వద్దకు వెళ్లి భర్తకు, ప్రియురాలికి దేహశుద్ధి చేసింది. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్ధలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు.

Advertisement
 
Advertisement
Advertisement