‘చదివించా.. ఉద్యోగం తెప్పించా.. ప్రియుడితో టీచర్‌ జల్సాలు’ | Man Sells Land To Educate Wife, Shocked After She Leaves Him Following Government Job, Husband’s Emotional Story Goes Viral | Sakshi
Sakshi News home page

‘చదివించా.. ఉద్యోగం తెప్పించా.. ప్రియుడితో టీచర్‌ జల్సాలు’

May 31 2026 9:31 AM | Updated on May 31 2026 11:40 AM

Bihar Aman Kumar accuses wife BPSC Gunjan Kumari abandoning family

కట్టుకున్న భార్యను చదివించేందుకు ఓ భర్త చేసిన త్యాగం అంతా ఇంతా కాదు. కూలి పనులకు వెళ్లి.. ఉన్న పొలం అమ్మి భార్యను చదివిస్తే.. తీరా ఉద్యోగం వచ్చాక కుటుంబాన్ని ఎగతాళి చేసి కన్న కొడుకును వదిలేసి మరొకరితో వెళ్లిపోయింది. దీంతో.. తన భార్యను నిలదీసేందుకు వెళ్లిన భర్తకు చేదు అనుభవం ఎదురైంది. ఆమె అద్దెకు ఉంటున్న ఇంటికి వెళ్లిన భర్తకు షాక్‌ తగిలింది. ఆమె తన ప్రియుడితో కలిసి చనువుగా ఉన్న దృశ్యం చూసి భర్త గుండె ఆగిపోయినంత పనైంది. ఈ ఘటన కుటుంబ బంధాలు, ఉద్యోగం తర్వాత మారే సంబంధాలపై మరోసారి పెద్ద చర్చకు దారి తీసింది.

బీహార్‌లోని వైశాలి జిల్లా హాజీపూర్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనపై భర్త అమన్‌ కుమార్‌ తెలిపిన వివరాల ప్రకారం.. అతను 2013లో గుంజన్ కుమారిని వివాహం చేసుకున్నాడు. అప్పటికి ఆమె ఇంటర్మీడియట్ మాత్రమే పూర్తిచేసి ఉంది. అయితే, ఆమెకు టీచర్ కావాలన్న లక్ష్యం ఉందని భ‍ర్తకు చెప్పింది. దీంతో, ఆమెను చదివించాలని అమన్‌ అనుకున్నాడు. కుటుంబ ఆర్థిక పరిస్థితి బలంగా లేకపోయినా, తాను కూలి పనులు చేస్తూ ఆమె చదువులకు అండగా నిలిచాడు. అంతేకాకుండా 2022లో తన భూమిని అమ్మి.. ఆమె డిగ్రీ, బీఈడ్ చదువులు, బీపీఎస్సీ టీచర్ నియామక పరీక్ష సన్నద్ధత కోసం డబ్బులు సమకూర్చినట్లు తెలిపాడు.

తర్వాత గుంజన్ కుమారి BPSC TRE-02 నియామక ప్రక్రియలో ఎంపికై టీచర్‌గా ప్రభుత్వ ఉద్యోగం సాధించింది. సుపౌల్ జిల్లాలో శిక్షణ పూర్తిచేసిన అనంతరం బిదుపూర్ బ్లాక్‌లోని ఒక ప్రభుత్వ పాఠశాలలో పోస్టింగ్ పొందింది. అయితే, ఉద్యోగం వచ్చిన తర్వాత ఆమె ప్రవర్తన పూర్తిగా మారిపోయింది. 2025 జనవరిలో గుంజన్ తమ 10 ఏళ్ల కుమారుడు ఆరుష్ ఆర్యను తన వద్దకు పంపించి, తాను సహచర టీచర్లతో కలిసి డార్జిలింగ్ వెళ్తున్నానని చెప్పింది. కానీ తర్వాత ఆ ప్రయాణానికి ఇతర టీచర్లు ఎవరూ వెళ్లలేదని అమన్‌కు తెలిసింది. దీంతో తన అనుమానాలు మరింత బలపడ్డాయి. ఈ క్రమంలో ఆరా తీయగా.. శిక్షణ సమయంలో ప్రేమ్ ప్రకాశ్ జైస్వాల్ అనే మరో టీచర్‌తో ఆమెకు సన్నిహిత సంబంధం ఏర్పడిందని, ఆ తర్వాత కుటుంబానికి దూరంగా ఉండడం ప్రారంభించిందని గుర్తించాడు.

ఈ క్రమంలో మే 23న హాజీపూర్‌లోని లిచ్ఛవి నగర్ ప్రాంతంలో ఆమె అద్దె ఇంటికి వెళ్లగా, అక్కడ ప్రేమ్ ప్రకాశ్‌తో కలిసి ఉండడాన్ని అమన్‌ చూసి షాకయ్యాడు. అనంతరం వెంటనే డయల్-112 పోలీసులకు సమాచారం ఇచ్చినట్లు తెలిపాడు. ఈ ఘటనతో ఆ ప్రాంతంలో కొంతసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. భర్తతో గుంజన్ గొడవ పెట్టుకుంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ అయింది. ఇక, ఈ వివాదంలో వారి కుమారుడు కూడా కేంద్ర బిందువుగా మారాడు. తన తల్లి మరో వ్యక్తిని “అంకుల్” అని పిలవాలని ఒత్తిడి చేసిందని, తాను ఆమెతో ఉండాలని అనుకోవడం లేదని బాలుడు చెప్పినట్లు కథనాలు వెలువడ్డాయి. దీంతో చిన్నారి భవిష్యత్తు, మానసిక పరిస్థితిపై కూడా ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement