భార్యా, కూతురి గొంతుకోసి భర్త ఆత్మహత్య | Wife and Daughter murdered, husband suicide in krishna district | Sakshi
Sakshi News home page

భార్యా, కూతురి గొంతుకోసి భర్త ఆత్మహత్య

Jul 18 2014 9:28 AM | Updated on Jul 27 2018 2:21 PM

కృష్ణా జిల్లా మచిలీపట్నం సమీపంలోని గూడూరు గ్రామంలో దారుణం చోటు చేసుకుంది.

 కృష్ణాజిల్లా కేంద్రమైన మచిలీపట్నం సమీపంలోని గూడూరు గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. అగ్నిసాక్షిగా పెళ్లాడిన భార్యతోపాటు కన్న కూతురిని వెంకన్న అనే వ్యక్తి గొంతు కోసి అత్యంత పాశవికంగా హత్య చేశాడు. అనంతరం అతడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ ఘటనపై స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.

దాంతో పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహలను స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. దర్యాప్తులో భాగంగా పోలీసులు హత్యకు సంబంధించి స్థానికులను ప్రశ్నిస్తున్నారు. ఆ హత్యకు వివాహేతర సంబంధమే కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. అనంతరం పోస్ట్మార్టం నిమిత్తం మచిలీపట్నంలోని జిల్లా ఆసుపత్రికి మృతదేహలను తరలించారు.
 

Advertisement
 
Advertisement
Advertisement