breaking news
gudur village
-
జగన్ సీఎం అయితే 45 ఏళ్లకే పింఛన్
సాక్షి, గూడూరు: వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్.జగన్ మోహన్‌రెడ్డి సీఎం అయితే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళలకు 45 ఏళ్లకే వైఎస్సార్ చేయూత పథకం కింద పింఛన్ వస్తుందని వైఎస్సార్ సీపీ వైద్య విభాగం రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ సుధాకర్ తెలిపారు. బుధవారం రాత్రి పట్టణంలో రావాలి జగన్.. కావాలి జగన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. డాక్టరసుధాకర్ దివంగత నేత వైఎస్.రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఆయన మాట్లాడుతూ టీడీపీ ప్రభుత్వంపై ప్రజలకు నమ్మకం పోయిందన్నారు. టీడీపీ నాయకుల అవినీతి ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరించాల్సిన బాధ్యత పార్టీ కార్యకర్తలపైనే ఉందని సూచించారు. 100మంది యువకులు పార్టీలో చేరిక.. పట్టణానికి చెందిన పి.రంగన్న, ఎస్.ఇమ్రాన్, పి.శ్రీనివాసులు, పి.దానియేలు, ఎం.దిలీప్, ఎ.చిన్న, బి.సురేష్, ఎం,జయకర్, పి.భాషా, బి.మోజెస్ మరో 90మంది యువకులు వైఎస్సార్ సీపీలో చేరారు. వారికి డాక్టర్ సుధాకర్ పార్టీ కండు వాలు కప్పి ఆహ్వానించారు. కార్యక్రమం లో పార్టీ మండల కన్వీనర్ జూలకల్లు భాస్కరరెడ్డి, నాయకులు డీటీ విఠల్, బండి రాజు, బి.రమేష్, చనుగొండ్ల మహేశ్వరరెడ్డి, కె.నాగలాపురం నరసింహారెడ్డి, సుందరం పాల్గొన్నారు. -
భార్యా, కూతురి గొంతుకోసి భర్త ఆత్మహత్య
-
భార్యా, కూతురి గొంతుకోసి భర్త ఆత్మహత్య
కృష్ణాజిల్లా కేంద్రమైన మచిలీపట్నం సమీపంలోని గూడూరు గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. అగ్నిసాక్షిగా పెళ్లాడిన భార్యతోపాటు కన్న కూతురిని వెంకన్న అనే వ్యక్తి గొంతు కోసి అత్యంత పాశవికంగా హత్య చేశాడు. అనంతరం అతడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ ఘటనపై స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దాంతో పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహలను స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. దర్యాప్తులో భాగంగా పోలీసులు హత్యకు సంబంధించి స్థానికులను ప్రశ్నిస్తున్నారు. ఆ హత్యకు వివాహేతర సంబంధమే కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. అనంతరం పోస్ట్‌మార్టం నిమిత్తం మచిలీపట్నంలోని జిల్లా ఆసుపత్రికి మృతదేహలను తరలించారు.