ఇంకా అజ్ఞాతంలోనే చింతమనేని | West Godavari TDP Leader Chintamaneni Prabhakar Escape | Sakshi
Sakshi News home page

ఇంకా అజ్ఞాతంలోనే చింతమనేని

Sep 10 2019 7:32 PM | Updated on Sep 10 2019 8:39 PM

West Godavari TDP Leader Chintamaneni Prabhakar Escape - Sakshi

సాక్షి, పశ్చిమగోదావరి: దెందులూరు మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నేత చింతమనేని ప్రభాకర్‌ ఇంకా అజ్ఞాతంలోనే ఉన్నారు. గత కొద్ది రోజులుగా చింతమనేని ఆచూకీ కోసం పోలీసులు గాలిస్తున్నారు. పినకడిమి గ్రామానికి చెందిన దళిత యువకులపై దాడి ఘటనలో చింతమనేనిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో చింతమనేనిని అదుపులోకి తీసుకునేందుకు 12 ప్రత్యేక బృందాలను ఏర్పాటుచేసిన పోలీసులు.. ఆయన కోసం రెండు తెలుగు రాష్ట్రాల్లో ముమ్మరంగా గాలిస్తున్నారు. ఇప్పటికే చింతమనేనిపై  పోలీసులు 10 కేసులు నమోదు చేశారు. గతంలో ఆయనపై నమోదైన కేసులను ఎస్పీ నవదీప్‌ సింగ్‌ గ్రేవల్‌ పరిశీలిస్తున్నారు. కాగా, పరారీలో ఉన్న చింతమనేని ముందస్తు బెయిలు కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం.

Advertisement
 
Advertisement
Advertisement