మంత్రులుగా మనోళ్లు

West Godavari Produced Many Ministers - Sakshi

సాక్షి, తాడేపల్లిగూడెం (పశ్చిమ గోదావరి): జిల్లా నుంచి శాసనసభ్యుడిగా ఎన్నికై మంత్రి పదవులు అలంకరించిన వారు కొద్దిమంది మాత్రమే ఉన్నారు. పలు కీలక శాఖల్లో మంత్రులుగా వీరు చక్రం తిప్పారు. 
♦ నరసాపురం నియోజకవర్గం నుంచి 1960లో గ్రంధి రెడ్డినాయుడు తొలిసారిగా జిల్లా నుంచి మంత్రిగా పనిచేశారు. పరకాల శేషావతారం 1976, 1978, 1981లో మంత్రిగా పనిచేశారు. చేగొండి హరిరామజోగయ్య 1983లో ఎన్టీఆర్‌ కేబినెట్‌లో అనంతరం కోట్ల విజయభాస్కరరెడ్డి మంత్రి వర్గంలో బెర్తు దక్కించుకున్నారు. కొత్తపల్లి సుబ్బారాయుడు 1994, 1999లో మంత్రిగా పనిచేశారు. 
♦ పాలకొల్లు నుంచి దాసరి పెరుమాళ్లు కాసు బ్రహ్మానందరెడ్డి మంత్రివర్గంలో మంత్రిగా పనిచేశారు. అల్లూరి సుభాష్‌చంద్రబోస్‌ 1990లో మర్రి చెన్నారెడ్డి మంత్రివర్గంలో మంత్రిగా ఉన్నారు. 
♦ ఉండి నియోజకవర్గం నుంచి కలిదిండి రామచంద్రరాజు (అబ్బాయిరాజు) 1987, 1999లో మంత్రిగా పనిచేశారు. 
♦ పెనుగొండ నియోజకవర్గం నుంచి ప్రత్తి మణెమ్మ 1986లో ఎన్టీఆర్‌ కేబినెట్‌లో మంత్రిగా పనిచేశారు. 
♦ అత్తిలి నియోజకవర్గం నుంచి ఇందుకూరి రామకృష్ణంరాజు భవనం వెంకట్రావు, కోట్ల విజయభాస్కరరెడ్డి మంత్రివర్గంలో మంత్రిగా పనిచేశారు. దండు శివరామరాజు 1999లో మంత్రిగా ఉన్నారు. 
♦ తాడేపల్లిగూడెం నియోజకవర్గం నుంచి 1983లో ఎన్టీఆర్‌ కేబినెట్‌లో ఈలి ఆంజనేయులు, 2014లో చంద్రబాబు మంత్రివర్గంలో పైడికొండల మాణిక్యాలరావు మంత్రులుగా పనిచేశారు. 
♦ ఉంగుటూరు నుంచి వైఎస్‌ మంత్రివర్గంలో వట్టి వసంత్‌కుమార్‌ మంత్రిగా ఉన్నారు. 
♦ దెందులూరు నియోజకవర్గం నుంచి మాగంటి రవీంద్రనాథ్‌చౌదరి మర్రి చెన్నారెడ్డి, నేదురుమిల్లి జనార్దనరెడ్డి మంత్రివర్గాల్లో మంత్రిగా పనిచేశారు. మాగంటి వరలక్ష్మీదేవి నేదురుమిల్లి జనార్దనరెడ్డి, కోట్ల విజయభాస్కరరెడ్డి మంత్రి వర్గాల్లో మంత్రిగా పనిచేశారు. 
♦ ఏలూరు నుంచి మరడాని రంగారావు 1989లో ఎన్టీఆర్‌ కేబినెట్‌లో మంత్రిగా ఉన్నారు. 
♦ గోపాలపురం నియోజకవర్గం నుంచి 1967లో టి.వీరరాఘవులు కాసు బ్రహ్మానందరెడ్డి మంత్రివర్గంలో మంత్రిగా ఉన్నారు. 1989లో కారుపాటి వివేకానంద మంత్రిగా పనిచేశారు. 
♦ కొవ్వూరు నియోజకవర్గం నుంచి 1978లో ఎంఏ అజీజ్‌ టి.అంజయ్య, భవనం వెంకట్రావు, కోట్ల విజయభాస్కరరెడ్డి మంత్రి వర్గాల్లో మంత్రిగా ఉన్నారు. చంద్రబాబు మంత్రివర్గంలో కేఎస్‌ జవహర్‌ చోటు దక్కించుకున్నారు. 
♦ ఆచంట నుంచి పితాని సత్యనారాయణ వైఎస్సార్, చంద్రబాబు కేబినెట్‌లో చోటు దక్కించుకున్నారు. 
చింతలపూడి నుంచి పీతల సుజాత చంద్రబాబు కేబినెట్‌లో మంత్రిగా పనిచేశారు. చింతలపాటి మూర్తిరాజు, కోటగిరి విద్యాధరరావు, మాగంటి వెంకటేశ్వరరావు(బాబు) అమాత్యా అనిపించుకున్నారు.

ఎమ్మెల్సీలుగా పనిచేసి..
శాసనమండలి సభ్యులుగా జలగం వెంగళరావు మంత్రివర్గంలో యర్రా నారాయణస్వామి మంత్రిగా పనిచేశారు. ఏలూరుకు చెందిన వీరమాచనేని వెంకటనారాయణ శాసనమండలి సభ్యునిగా 1978లో చెన్నారెడ్డి మంత్రివర్గంలో పనిచేశారు. శాసనమండలి సభ్యునిగా కంతేటి సత్యనారాయణరాజు 1981 టి.అంజయ్య మంత్రివర్గంలో సభ్యునిగా ఉన్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top