సంక్షేమశాఖలో కొట్లాటపై సమగ్ర విచార ణ | Welfare Office thrilling fights | Sakshi
Sakshi News home page

సంక్షేమశాఖలో కొట్లాటపై సమగ్ర విచార ణ

May 31 2014 2:32 AM | Updated on Oct 20 2018 6:17 PM

జిల్లా సాంఘిక సంక్షేమశాఖ కార్యాలయంలో గురువారం ఉద్యోగుల మధ్య జరిగిన బాహాబాహీకి సంబంధించి శుక్రవారం ఐదవ నగర సీఐ రాజశేఖర్‌రెడ్డి, ఎస్సై సోమయ్య కార్యాలయానికి చేరుకుని సమగ్ర విచారణ చేపట్టారు.

నెల్లూరు సిటీ, న్యూస్‌లైన్: జిల్లా సాంఘిక సంక్షేమశాఖ కార్యాలయంలో గురువారం ఉద్యోగుల మధ్య జరిగిన బాహాబాహీకి సంబంధించి శుక్రవారం ఐదవ నగర సీఐ రాజశేఖర్‌రెడ్డి, ఎస్సై సోమయ్య కార్యాలయానికి చేరుకుని సమగ్ర విచారణ చేపట్టారు. అయితే పలువురు సిబ్బంది వివరా లు తెలిపేందుకు నిరాకరించారు. సమా ధానాలు చెప్పేవారు మాత్రమే కార్యాల యంలో ఉండాలని, మిగతా వారు వెళ్లిపోవాలని పోలీసులు సూచించారు. దీంతో ఆరుగురు సిబ్బంది మాత్రమే జరిగిన ఘటన వివరించేందుకు ముందుకు వచ్చా రు.  
 
 వారందరినీ ఒకేసారి విచారించడంపై సిబ్బంది అభ్యంతరం వ్యక్తం చేశారు. ఒక్కొక్కరిని గదిలోకి పిలిపించి వ్యక్తిగతంగా విచారిస్తే వాస్తవాలు వెలుగులోకి వస్తాయని అభిప్రాయపడ్డారు. సిబ్బందిని విచారించిన తర్వాత పోలీసు అధికారులు సోషల్ వెల్ఫేర్ డీడీ యు.ప్రసాదరావు, జిల్లా సాంఘిక సంక్షేమశాఖాధికారి సీహెచ్ నాగేంద్రరావులను కలిసి వివరాలు సేకరించారు. విచారణ నివేదికలను ఉన్నతాధికారులకు సమర్పించిన తర్వాత తప్పు చేసిన వారిని సస్పెండ్ చేసే అవకాశం ఉంది.
 

Advertisement
 
Advertisement
Advertisement