రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు ప్రతి అవకాశాన్ని వినియోగించుకుంటున్నామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫ్లోర్ లీడర్ శోభానాగిరెడ్డి స్పష్టం చేశారు.
రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు ప్రతి అవకాశాన్ని వినియోగించుకుంటున్నామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫ్లోర్ లీడర్ శోభానాగిరెడ్డి స్పష్టం చేశారు. బుధవారం శోభా నాగిరెడ్డి అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాట్లాడుతూ... అసెంబ్లీని ప్రత్యేకంగా సమావేశపరిచి సమైక్య తీర్మానం ఆమోదించి కేంద్రానికి పంపాలని గతంలోనే స్పీకర్ గవర్నర్ నర్సింహన్, నాదెళ్ల మనోహర్, సీఎం కిరణ్ కుమార్ రెడ్డిలను కోరామని ఆమె గుర్తు చేశారు.
బిల్లుపై చర్చకు ఒక్కరోజు మాత్రమే మిగిలి ఉందని, ఈ నేపథ్యంలో తమ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ సహా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు తమ అభిప్రాయం చెప్పలేదన్నారు. టి.బిల్లుపై చర్చను కొనసాగించేందుకు సమావేశాలు పొడిగించాలని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, స్పీకర్కు లేఖ రాశామని శోభానాగిరెడ్డి ఈ సందర్భంగా గుర్తు చేశారు.