రెండేళ్ల క్రితమే బస్సు అమ్మేశాం: జేసీ ట్రావెల్స్ | we sold away Volvo Bus Two years ago: JC Travels | Sakshi
Sakshi News home page

రెండేళ్ల క్రితమే బస్సు అమ్మేశాం: జేసీ ట్రావెల్స్

Oct 30 2013 10:25 AM | Updated on Oct 8 2018 5:04 PM

రెండేళ్ల క్రితమే బస్సు అమ్మేశాం: జేసీ ట్రావెల్స్ - Sakshi

రెండేళ్ల క్రితమే బస్సు అమ్మేశాం: జేసీ ట్రావెల్స్

మహబూబ్నగర్ జిల్లాలో ప్రమాదానికి గురైన వోల్వో బస్సుతో తమ ట్రావెల్స్కు ఎలాంటి సంబంధం లేదని జేసీ ట్రావెల్స్ యాజమాన్యం స్పష్టం చేసింది.

అనంతపురం : మహబూబ్నగర్ జిల్లాలో ప్రమాదానికి గురైన వోల్వో బస్సుతో తమ ట్రావెల్స్కు ఎలాంటి సంబంధం లేదని జేసీ ట్రావెల్స్ యాజమాన్యం స్పష్టం చేసింది. తాము రెండేళ్ల క్రితమే బస్సును అమ్మివేసినట్లు యాజమాన్యం బుధవారమికర్కడ తెలిపింది. జబ్బర్ ట్రావెల్స్తో తమకు ఎలాంటి సంబంధం లేదని... అయితే టైటిల్ మార్చకపోవటం వల్లే తమ ట్రావెల్స్ పేరు ఉందన్నారు.

ప్రమాదం జరిగిన జబ్బార్‌ బస్సు  (AP 02  TA 0963) దివాకర్‌ ట్రావెల్స్‌ పేరిట రిజిస్ట్రేషన్‌ అయింది. అయితే ఈ బస్సును 2010 అక్టోబర్లో విక్రయించినట్టుగా ఆర్టీఏ రికార్టులు చెబుతున్నాయి. కాగా ప్రమాదం జరిగినప్పుడు బస్సులో 49 మంది ప్రయాణీకులు ఉన్నట్టు తెలుస్తోంది. ఇందులో 42 మంది   అగ్నికి అహుతైపోయారు. ప్రమాదం జరిగే సమయంలో ప్రయాణీకులు గాఢ నిద్రలో ఉన్నారు. వారంతా నిద్రలోనే మృత్యువడికి చేరుకున్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement