అసెంబ్లీలో మాకు భద్రత కల్పించండి: టీజీ | We need security in assembly, says TG venkatesh | Sakshi
Sakshi News home page

అసెంబ్లీలో మాకు భద్రత కల్పించండి: టీజీ

Jan 29 2014 12:58 PM | Updated on Sep 2 2017 3:09 AM

అసెంబ్లీలో మాకు భద్రత కల్పించండి: టీజీ

అసెంబ్లీలో మాకు భద్రత కల్పించండి: టీజీ

అసెంబ్లీలో ఓటింగ్ జరిగితే విధ్వంసానికి అవకాశం ఉందని మంత్రి టీజీ వెంకటేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

హైదరాబాద్ : అసెంబ్లీలో ఓటింగ్ జరిగితే విధ్వంసానికి  అవకాశం ఉందని మంత్రి టీజీ వెంకటేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓటింగ్ ముగిశాక తమపై దాడి జరిగే అవకాశం ఉన్నందున తమకు భద్రత కల్పించాలన్నారు. దాడులకు పాల్పడేవారిపై ముందే చర్య తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. అసెంబ్లీలో తక్షణమే తెలంగాణ బిల్లుపై ఓటింగ్ పెట్టాలన్నారు. ఓడిపోతామనే భయంతో ఓటింగ్కు ఒప్పుకోవటం లేదని టీజీ అన్నారు.

మరో మంత్రి పార్థసారధి మాట్లాడుతూ ఓటింగ్ కోరటం ప్రతి సభ్యుడి హక్కు అన్నారు. ఓటింగ్ పెట్టాలని 159మంది సభ్యులు స్పీకర్కు లిఖితపూర్వకంగా లేఖలు ఇచ్చారన్నారు. మెజార్టీ సభ్యులు సమైక్యాన్నే కోరుకుంటున్నారని, గురువారం అసెంబ్లీకి భద్రత పెంచాలని మంత్రి డిమాండ్ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement