మంత్రి సునీతను నిలదీసిన తెలుగు తమ్ముళ్లు | we are also required water | Sakshi
Sakshi News home page

మంత్రి సునీతను నిలదీసిన తెలుగు తమ్ముళ్లు

Aug 25 2014 3:19 AM | Updated on Sep 2 2017 12:23 PM

మంత్రి సునీతను నిలదీసిన  తెలుగు తమ్ముళ్లు

మంత్రి సునీతను నిలదీసిన తెలుగు తమ్ముళ్లు

‘అక్కా... పేరూరు డ్యామ్‌కే కాదు... మొదట మా కళ్యాణదుర్గం చెరువులకూ నీరివ్వండి’ అంటూ పౌరసరఫరాల శాఖ మంత్రి పరిటాల సునీతను తెలుగు తమ్ముళ్లు నిలదీశారు.

పేరూరుకే కాదు.. మా చెరువులకూ నీరివ్వండి

కళ్యాణదుర్గం : ‘అక్కా... పేరూరు డ్యామ్‌కే కాదు... మొదట మా కళ్యాణదుర్గం చెరువులకూ నీరివ్వండి’ అంటూ పౌరసరఫరాల శాఖ మంత్రి పరిటాల సునీతను తెలుగు తమ్ముళ్లు నిలదీశారు. ఆదివారం సివిల్ సప్లై గోదాముల ప్రారంభోత్సవ కార్యక్రమంలో పేరూరు డ్యామ్‌కి నీరు తీసుకొస్తే రైతు సమస్యలు తీరుతాయని మంత్రి పరిటాల సునీత చెప్పారు.

కార్యక్రమం ముగిశాక ఎమ్మెల్యే ఉన్నం హనుమంతరాయచౌదరి కుమారుడు మారుతి, మాజీ జెడ్పీటీసీ సభ్యుడు బాదన్నలు కళ్యాణదుర్గం రైతుల కష్టాలు తీరాలంటే మొదట ఈ ప్రాంత చెరువులకు నీరందించాలని మంత్రిని డిమాండ్ చేశారు. ఇక్కడికి నీరిచ్చిన తర్వాతే పేరూర్ డ్యామ్‌కు తీసుకెళ్లండన్నారు. ఇందుకు స్పందించిన మంత్రి ఇది వరకే చేయించిన సర్వే ప్రకారం రూ.800కోట్లు ఖర్చు అవుతుందని, కళ్యాణదుర్గం మీదుగా చెరువులకు నీరు నింపి పేరూరుకు తీసుకెళ్లాలంటే నిధులు రెండింతలు కావాలని తెలపగా.. ఇదే ప్రతిపాదనను అమలు చేయాలని నాయకులు కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement