పవర్ పెట్రోల్‌కు బదులు నీరు

చర్యలు చేపట్టాలని వినియోగదారులు డిమాండ్
విజయనగరం ,బొబ్బిలి రూరల్ : విజయనగరం జిల్లా బొబ్బిలి పట్టణంలో జేసీ ఫిల్లింగ్ స్టేషన్(పెట్రోల్‌బంక్)లో పవర్ పెట్రోల్‌లో నీరు కలిసింది. బుధవారం మధ్యాహ్నం బాటిల్స్‌లో పవర్‌పెట్రోల్ కొనుగోలు చేసిన బొబ్బిలికి చెందిన పప్పల చంద్రశేఖర్, ఎం.బూర్జవలసకు చెందిన గేదెల గౌరునాయుడు, జగన్నాథపురానికి చెందిన టి.జీవన్‌కుమార్, బొబ్బిలికి చెందిన వి.మోహనరావులకు ఆయిల్‌లో నీరుకలిసి ఉండడంతో మేనేజర్ శేఖర్ దృష్టికి తీసుకువచ్చారు. ఇలా అయితే వాహనాలు పాడైపోతాయని, తక్షణమే యాజమాన్యంపై చర్యలు చేపట్టాలని వినియోగదారులు డిమాండ్ చేశారు. కాగా జేసీ ఫిల్లింగ్ స్టేషన్ మేనేజర్ శేఖర్, యజమాని శ్రీనివాసరావు దీనిపై వివరణ ఇస్తూ ఉదయమే ట్యాంక్ వచ్చిందని, తాము శాంపిల్స్ తీశామని, అప్పుడు ఎలాంటి సమస్యలేదని మేనేజర్ తెలిపారు. ఈ విషయంలో తమ తప్పిదంలేదని, విశాఖలో హెచ్‌పీ సేల్స్‌మేనేజర్ దృష్టికి ఈ సమస్య తీసుకెళతామని, తాము దీనిపై చర్యలు చేపడతామని తెలిపారు. పవర్ సేల్స్ నిలిపివేసి, సమస్య వచ్చిన వారికి పెట్రోల్ తిరిగి అందించారు.
*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి