పచ్చ రంగు.. కొత్త హంగు | water 20 liters 2rupes tdp government in Eluru | Sakshi
Sakshi News home page

పచ్చ రంగు.. కొత్త హంగు

Jan 6 2015 1:58 AM | Updated on Sep 2 2017 7:15 PM

పచ్చ రంగు.. కొత్త హంగు

పచ్చ రంగు.. కొత్త హంగు

శుద్ధి చేసిన నీటిని రూ.రెండుకే 20 లీటర్ల చొప్పున పంపిణీ చేసేందుకు సర్కారు ప్రవేశపెట్టిన ఎన్టీఆర్ సుజల స్రవంతి పథకం ఆచరణలో పడకేసింది.

 ఏలూరు : శుద్ధి చేసిన నీటిని రూ.రెండుకే 20 లీటర్ల చొప్పున పంపిణీ చేసేందుకు సర్కారు ప్రవేశపెట్టిన ఎన్టీఆర్ సుజల స్రవంతి పథకం ఆచరణలో పడకేసింది. పల్లె ప్రజలకు.. పట్టణాల్లోని మురికివాడల్లో నివాసం ఉంటున్నపేదలకు సురక్షిత నీటిని అందించాలనే సంకల్పంతో అమల్లోకి తెచ్చిన ఈ పథ కం కింద చాలాచోట్ల పాత వాటర్ ప్లాం ట్లకు పసుపు రంగు పూసి.. ‘ఎన్టీఆర్ సుజల స్రవంతి’ అంటూ బోర్డులు రాశా రు. జిల్లాలో మొత్తం 480 ప్లాంట్లను నెలకొల్పాలని పంచాయతీ, ఆర్‌డబ్ల్యుఎస్ అధికారులు లక్ష్యంగా నిర్ణయిం చగా, కేవలం 180 ప్లాంట్లను మాత్రమే ఏర్పాటు చేశారు. వీటిలోనూ సగానికి పైగా ప్లాంట్లు చాలాకాలంలో వివిధ సంస్థల ఆధ్వర్యంలో నడుస్తున్నవే.
 
 వాటిని టీడీపీ నాయకులు, అధికారులు బలవంతంగా లాక్కున్నారనే విమర్శలు న్నాయి. ఈ ప్లాంట్లను కొందరు నేతలు ఆదాయ మార్గంగా మార్చుకున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అధిక ధరలపై చర్యలు శూన్యంసుజల స్రవంతి పథకం కింద రూ.రెం డుకే 20 లీటర్ల నీటిని అందించాలని సర్కారు నిర్ణయించగా, చాలా గ్రామా ల్లో ఇందుకు విరుద్ధంగా ధరలు వసూ లు చేస్తున్నారు. చాలాచోట్ల 20 లీటర్లకు రూ.4 నుంచి రూ.5 వసూలు చేస్తున్నారు. ఈ ప్లాంట్లపై పంచాయతీ అధికారులు, ఆర్‌డబ్ల్యుఎస్ అధికారుల పర్యవేక్షణ లోపించడంతో నీటి వ్యాపా రం జోరుగా సాగుతోంది.
 

Advertisement
 
Advertisement
Advertisement