పాస్ పుస్తకాలు ఆన్‌లైన్ చేసేందుకు డబ్బులు డిమాండ్ చేసి 3,500 రూపాయలు లంచం తీసుకుంటూ విజయ నగరం జిల్లా
బలిజిపేట: పాస్ పుస్తకాలు ఆన్‌లైన్ చేసేందుకు డబ్బులు డిమాండ్ చేసి 3,500 రూపాయలు లంచం తీసుకుంటూ విజయ నగరం జిల్లా బలిజిపేట మండలంలోని పెదపెంకి వీఆర్‌ఓ బె జ్జిపురం నాగేశ్వరరావు ఏసీబీ అధికారులకు గురువారం పట్టుబడ్డారు. అవినీతి నిరోధకశాఖ డీఎస్పీ లక్ష్మీపతి తెలిపిన వివరాలిలా ఉన్నాయి. బొబ్బిలి మండలం శివడవలస గ్రామానికి చెందిన వెంగళ నారాయణరావు, భార్య లక్ష్మీరాణి పేరున పెదపెంకి పంచాయతీ పరిధిలో ఉన్న భూమికి సంబంధించి పాస్ పుస్తకాలు ఆన్‌లైన్ చేసేందుకు వీఆర్‌ఓ నాగేశ్వరరావు లంచం డిమాండ్ చేశారు. దీనిపై నారాయణరావు ఏసీబీని ఆశ్రయించడంతో పథకం ప్రకారం వీఆర్‌ఓను పట్టుకున్నారు. కార్యక్రమంలో డీఎస్పీతో పాటు సీఐ రమేష్, లక్ష్మోజీ, సిబ్బంది పాల్గొన్నారు.