ఇన్నాళ్లకు గుర్తొచ్చామా బాబు..!

Vizianagaram Auto Drivers Slams Chandrababu naidu - Sakshi

ఎన్నికల తాయిలాలు ప్రకటిస్తున్న టీడీపీ సర్కార్‌

ఆటోలు, ట్రాక్టర్లకు లైఫ్‌టాక్స్‌ మినహాయింపు ఇచ్చిన ప్రభుత్వం

ఇప్పటికే చెల్లించిన ఆటోవాలాలు

బాబును నమ్మే రోజులు పోయాయంటున్న వైనం

విజయనగరం, రామభద్రపురం:గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను గాలికొదిలేసిన చంద్రబాబు ఇప్పుడు మళ్లీ ఎన్నికలు సమీపిస్తుండడంతో కొత్త గిమ్మిక్కులకు తెరదీస్తున్నారు. దానిలో భాగంగానే ఆటోలు, ట్రాక్టర్లకు పన్ను మినహాయింపు ఇచ్చేందుకు నిర్ణయం తీసుకున్నారన్న విమర్శలు ఆటోవాలాలు, ట్రాక్టర్ల యజమానుల విమర్శిస్తున్నారు. గతంలో ఆటోలకు త్రైమాసిక పన్ను విధానం అమల్లో ఉండేది. దాన్ని రద్దు చేసి జీవిత కాల పన్నులు తీసుకొచ్చారు. దాంతో ఒక్కో ఆటోకు రూ.2వేల నుంచి రూ.4వేల వరకు ఆయా కార్మికులు పన్ను చెల్లిస్తున్నారు. ఇది తమకు భారంగా ఉందని, దీన్నుంచి మినహాయించాలని పలుసార్లు సీఎంకు ఆటోవాలాలు, వారి యూనియన్లు సీఎంకు వినతులు ఇచ్చారు. ధర్నాలు, నిరసనలు చేపట్టారు. అప్పుడు ఏ మాత్రం సీఎం పట్టించుకోలేదు. కానీ వైఎస్సార్‌ సీపీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి పాదయాత్రలో ఆటో కార్మికులను అన్ని విధాలా ఆదుకుంటానని భరోసా ఇచ్చారు. వారి సమస్యలు తెలుసుకున్నారు.

ఓట్ల కోసం..
జగన్‌ పాదయాత్ర, ఎన్నికలు సమీపిస్తుండడంతో చంద్రబాబు ఎన్నికల రాజకీయానికి తెరదీశారు. ఆటోవాలాల్లో ఎక్కువమంది పేదవారే, పోషణ కోసం ఆటో నడుపుతూ బతుకుబండి సాగిస్తున్నారు. అలాంటి పరిస్థితుల్లో రాష్ట్రప్రభుత్వం త్రైమాసిక విధానాన్ని పక్కనపెట్టి జీవిత కాల పన్ను విధానాన్ని తీసుకొచ్చింది. దీని వల్ల ఒక ఆటోకు ఒకే సారి రూ.2వేల నుంచి రూ.4వేలు వరకు పన్ను చెల్లించాల్సి వస్తోంది. లేనిపక్షంలో ఆటోలకు ఫిట్‌నెస్‌ సర్టిఫికెట్‌ ఇవ్వొద్దన్న నిబంధనను ఈ ప్రభుత్వమే తీసుకొచ్చింది. ఈ నిర్ణయం వచ్చేముందే చాలా మంది కార్మికులు అప్పులు చేసి మరీ పన్నులు కట్టేశారు. నాలుగున్నరేళ్లుగా వారి బాధలను పట్టించుకోని ప్రభుత్వం ఎన్నికలు సమీపిస్తున్న వేళ వారిపై ప్రేమ కురిపిస్తున్నట్లు నటిస్తోందని విమర్శలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే కట్టేయడం వల్ల నష్టపోయామని ఆటోవాలాలు చెబుతున్నారు.

అధికారం కోసమే గిమ్మిక్కులు..
ఇన్నాళ్లు ఇలాంటి నిర్ణయాలు తీసుకోకుండా ఇప్పుడు ఎన్నికల్లో ఓట్ల కోసం రాష్ట్ర ప్రభుత్వం ఇలాంటి గిమ్మిక్కులకు తెరదీస్తుందని ఆటోవాలాలు, ట్రాక్టర్ల యజమానులు అంటున్నారు. ఎన్ని గిమ్మిక్కులు చేసినా ఈ సారి చంద్రబాబును నమ్మేది లేదని చెబుతున్నారు. గతంలో పెట్రోల్, డీజిల్‌ ధరలను తగ్గిస్తామని చెప్పి అధికారంలోకి వచ్చాక వాటిని పెంచిన ఘనత బాబుదే అని అంటున్నారు. జగన్‌ ఏడాది రూ.10వేలు ఇస్తామని చెప్పగానే ఇలాంటి గాలాలు వేస్తున్నామని, తామంతా జగనన్న వెంటే నడవాలని నిర్ణయించుకున్నట్లు చెబుతున్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top