మంత్రి శ్రీధరబాబుపై ఎంపీ వివేక్ చేస్తున్న విమర్శలు అర్థరహితమని, ఆయన మతితప్పి మాట్లాడుతున్నారని ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ అడ్ల్లూరి లక్ష్మణ్‌కుమార్ అన్నారు.
సాక్షి, కరీంనగర్: మంత్రి శ్రీధరబాబుపై ఎంపీ వివేక్ చేస్తున్న విమర్శలు అర్థరహితమని, ఆయన మతితప్పి మాట్లాడుతున్నారని ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ అడ్ల్లూరి లక్ష్మణ్‌కుమార్ అన్నారు. శ్రీధర్‌బాబు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉన్నప్పటినుంచీ తె లంగాణ ఉద్యమంలో క్రియాశీలంగా వ్యవహరిస్తున్నారని, పార్టీ శ్రేణులకు ఉద్యమం లో దిశానిర్ధేశం చేశారని గుర్తు చేశారు. వం టావార్పు లాంటి జేఏసీ కార్యక్రమాల్లో కాం గ్రెస్ కార్యకర్తలు పాల్గొనేలా శ్రీధర్‌బాబు చొరవ చూపారని వివరించారు.
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ తుదిదశకు చేరిన సమయంలోనూ కాంగ్రెస్ అధిష్టానానికి 50 ఏళ్లుగా తెలంగాణకు జరిగిన అన్యాయాలను వివరించారన్నారు. కీలక సమయాల్లో మంత్రి అధిష్టానం పెద్దలను కలిసి తెలంగాణ ఆకాంక్షలను బలంగా వినిపించారని, పలు సందర్భాల్లో ఆయన వినిపించిన వాదనలు ఢిల్లీ నేతలపై ప్రభావం చూపాయని అన్నారు. కాంగ్రెస్‌లో అనేక పదవులు పొంది, సీఎం పదవిపై కాంక్షతోనే టీఆర్‌ఎస్‌లోకి వెళ్లిన వివేక్‌కు మంత్రి శ్రీధర్‌బాబుపై విమర్శలు చేసే నైతిక అర్హత లేదన్నారు. ఇకనైనా వివేక్ పద్ధతి మార్చుకోవాలని, ఇలాగే విమర్శలు చేస్తే కాంగ్రెస్ కార్యకర్తలు సహించరని హెచ్చరించారు.