వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన విశ్వరూప్

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన విశ్వరూప్ - Sakshi


హైదరాబాద్ : మాజీమంత్రి విశ్వరూప్ శుక్రవారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో ఆయన పార్టీ సభ్యత్వం తీసుకున్నారు. ఈ సందర్భంగా జగన్ ....విశ్వరూప్కు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.


రాష్ట్ర విభజన నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ విశ్వరూప్ ....మంత్రి పదవికి, కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా విశ్వరూప్ మాట్లాడుతూ  సమైక్యాంధ్ర ఉద్యమంలో దూసుకు పోతున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో తాను సుశిక్షితుడైన సైనికుడిలా పోరాడతానని చెప్పారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top