విశాలాంధ్రకు కాబోయే సీఎం జగన్ | visalandhra up coming Chief minister Y.S jagan mohan reddy | Sakshi
Sakshi News home page

విశాలాంధ్రకు కాబోయే సీఎం జగన్

Jan 25 2014 2:13 AM | Updated on Aug 17 2018 8:19 PM

రాష్ట్రం సమైక్యంగానే ఉంటుందని వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి విశాలాంధ్రకు ముఖ్యమంత్రి అవుతారని ఆ పార్టీ సీజీసీ సభ్యుడు, ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.

సంగం, న్యూస్‌లైన్: రాష్ట్రం సమైక్యంగానే ఉంటుందని వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి విశాలాంధ్రకు ముఖ్యమంత్రి అవుతారని ఆ పార్టీ సీజీసీ సభ్యుడు, ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. శుక్రవారం ఆత్మకూరు నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త మేకపాటి గౌతమ్‌రెడ్డి సంగంలో చేస్తున్న  పాదయాత్రలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగన్‌మోహన్‌రెడ్డి సీఎం కావడం తధ్యమని తెలిసి కాంగ్రెస్, టీడీపీ కుమ్మక్కై ఆయన ప్రభావం తగ్గిందనే దుష్ర్పచారానికి దిగారని విమర్శించారు. ఈ దుష్ర్పచారానికి ఎల్లో మీడియా తన వంతు సాయం చేస్తోందన్నారు. ఈ ప్రచారాన్ని ప్రజలు గాలి మాటలుగా కొట్టిపారవేస్తున్నారని తెలిపారు.
 
 తమ కుట్రలు, కుతంత్రాలు పనిచేయకపోవడంతో ఆ రెండు పార్టీలు మరోసారి కుమ్మక్కై గ్రాఫ్ డ్రామా ఆడుతున్నాయన్నారు. వైఎస్సార్ గురించి అవాకులు, చెవాకులు పేలుతున్న నేతల రాజకీయ జీవితం వచ్చే ఎన్నికలతో ముగుస్తుందన్నారు. సమైక్య రాష్ట్రాన్ని సైతం చీల్చేందుకు టీడీపీ, కాంగ్రెస్ పార్టీలు కలిసి పనిచేస్తున్నాయని తెలిపారు.

సోనియా రచించిన రాష్ట్ర విభజన నాటకంలో కిరణ్‌కుమార్‌రెడ్డి గొప్పగా నటిస్తున్నారన్నారు. బాబు రెం డు కళ్ల సిద్ధాంతం, టెంకాయ కథలతో విభజనకు సహకరిస్తున్నారని తెలిపారు. లేఖను వెనక్కు తీసుకోమని అడిగితే స్పందించని చం ద్రబాబును సీమాంధ్ర ప్రజలు తరిమికొట్టే రో జులు దగ్గరలోనే ఉన్నాయన్నారు. అసెంబ్లీలో సమైక్యాంధ్ర కోసం వైఎస్సార్‌సీపీ ఒక్కటే పోరాడుతుందన్నారు.
 
 తమ పోరాటంతోనే సమైక్యాంధ్ర నినాదం నిలబడిందన్నారు. పార్లమెంటులో బిల్లు వస్తే అక్కడ నెగ్గకుండా చేయాలని అన్ని పార్టీల నేతలను తమపార్టీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి కలిసి మద్దతు కూడగట్టారని తెలిపారు. మహానేత వెఎస్సార్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల ఫలాలు ప్రజలకు అందడంలేదన్నారు. జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి అయిన క్షణం నుంచి మహానేత వైఎస్సార్ ప్రవేశపెట్టిన పథకాలన్నీ సక్రమంగా అందేలా చర్యలు తీసుకుంటారని తెలిపారు. ఆత్మకూరు నియోజకవర్గంలో తన కుమారుడు గౌతమ్‌రెడ్డి చేస్తున్న పాదయాత్రకు వస్తున్న స్పందన చూస్తుంటే తండ్రిగా తనకు ఎంతో సంతోషంగా ఉందన్నారు. పాదయాత్రలో భాగంగా ప్రజలను కలిసినప్పుడు వచ్చే ఎన్నికల్లో మా ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డేనని చెబుతున్నారని తెలిపారు. యువకులు, మహిళలు, వృద్ధులతో పాటు అన్ని వర్గాల ప్రజలు చూపుతున్న ఆదరణ తాను ఎ ప్పటికీ మరిచిపోనని తెలిపారు.

కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ, వైఎస్సార్‌సీపీ సీఈసీ సభ్యుడు బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డి, మర్రిపాడు నాయకులు బిజివేములు వెంకటసుబ్బరెడ్డి, సంగం, ఆత్మకూరు మండలాల వైఎస్సార్‌సీపీ కన్వీన్వర్లు డాక్టర్ ఐవీ కృష్ణారెడ్డి, ఇందూరు నారసింహారెడ్డి, సంగం నాయకులు వాసుదేవరెడ్డి, మదన్‌మోహన్‌రెడ్డి, నారసింహారెడ్డి, జనార్దన్ రెడ్డి, నజీర్, నయీంమున్నీసా, మల్లికార్జునరెడ్డి, సురేంద్రరెడ్డి, రేవూరు గోపాల్‌రెడ్డి, వనిపెంట వెంకటసుబ్బారెడ్డి, ఎస్‌వీ రమణరెడ్డి, యర్రబల్లి శంకర్‌రెడ్డి, భాస్కర్‌రెడ్డి, వెంకటేశ్వర్లు, చిట్టిబాబు, రామచంద్రారెడ్డి పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement