breaking news
state united
-
తెగిన లెక్కలు
సమైక్య రాష్ట్రంతో ఉద్యోగులు, పెన్షనర్లకు ఆర్థిక బంధం పూర్తిగా తెగిపోయింది. శనివారం వారు ఆఖరి వేతనం అందుకున్నారు. ఉమ్మడి రాష్ట్ర ఆర్థిక బడ్జెట్ పరిధిలో చెల్లింపులు పూర్తయ్యాయి. జిల్లా ట్రెజరీ ద్వారా ఒక్కరోజే రూ.112 కోట్ల చెల్లింపులు జరిగాయి. ఇకనుంచి ఏ రాష్ట్ర ఖర్చులు, చెల్లింపులు, ఆ రాష్ట్రం పరిధిలోకే వెళ్లనున్నాయి. కలెక్టరేట్, న్యూస్‌లైన్ : తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావానికి మరో ఎనిమిది రోజులే మిగిలిఉంది. విభజన నేపథ్యంలో ఉమ్మడి రాష్ట్రంలో ఆర్థిక అంశాలకు ఈ నెల 24 వరకు ప్రభుత్వం గడువు విధించింది. ఈ మేరకు శనివారం చెల్లింపులన్నీ పూర్తయ్యాయి. ఇకనుంచి తెలంగాణ, సీమాంధ్ర లెక్కలు వేటికవే అంటూ ఇప్పటికే ట్రెజరీ శాఖకు ఉత్తర్వులు అందాయి. ఆర్థిక ప్రక్రియ అంతా పూర్తి చేసి ఉద్యోగులకు, పెన్షనర్లకు 1750 బిల్లుల రూపంలో శనివారం ఒక్కరోజే రూ.112 కోట్లు చెల్లించారు. జిల్లాలో అన్ని విభాగాల్లో కలిపి 31 వేల మంది ప్రభుత్వ ఉద్యోగులు (కేంద్ర ప్రభుత్వం, సింగరేణి, ఆర్టీ సీ ఉద్యోగులు, కార్మికులు మినహాయించి) ఉ న్నారు. ట్రెజరీ శాఖ పరిధిలోని 15వేల మంది ఉద్యోగులకు మే నెల వేతనాలు రూ.50 కోట్లు, 20,700 మంది పెన్షనర్లకు రూ.45 కోట్లు, జూన్ ఒకటో తేదీ వేతనం, టీఏ, డీఏ, ఇతర అలవెన్సులు రూ.17 కోట్లు కలిపి మొత్తంగా రూ.112 కోట్ల వరకు చెల్లింపులు జరిగాయి. ట్రెజరీ పరిధి లో లేని మరో 15వేల మంది ఉద్యోగులకు రూ.30కోట్ల చెల్లింపులు జరిగినట్లు సమాచారం. పదిహేను రోజులు సేవలకు బ్రేక్! రాష్ట్ర విభజన నేపథ్యంలో ట్రెజరీ కార్యకలాపాలు నిలిచిపోనున్నాయి. నేడు ఆదివారం సెల వు దినం కాగా, సోమవారం ప్రభుత్వ ఆదేశాల ప్రకారం సేవలు ఆధారపడి ఉన్నాయి. సాంకేతికపరంగా ఇబ్బందులొస్తే అన్ని రకాల బిల్లుల చెల్లింపులు జరిపేందుకు ఈనెల 26 వరకు గడువు విధిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని ట్రెజరీ డీడీ పవన్‌కుమార్ తెలిపారు. జూన్ 2న రాష్ట్రం ఏర్పడుతుండడంతో వచ్చే నెల నుంచి బడ్జెట్ విధానం తెలంగాణ రాష్ట్ర పరిధిలోకి రానుంది. ప్రభుత్వ ఏర్పాటు నేపథ్యంలో కొత్త ఖాతాలు తెరుస్తుండగా 15 రోజులపాటు లావాదేవీలు నిలిచిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. పంచాయతీరాజ్, శాసనసభ, పార్లమెంట్, సభ్యుల నియోజకవర్గ అభివృద్ధి పనుల బిల్లులు, కాంట్రాక్ట్, మెడికల్, రీయింబర్స్మెంట్ తదితర బిల్లుల చెల్లింపులు ఆగిపోనున్నాయి. ఉద్యోగుల్లో ఆనందం ప్రత్యేక రాష్ట్ర ఆవిర్భావం కోసం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నామని సమైక్య రాష్ట్రంలో శనివారం చివరి వేతనం తీసుకున్న పలువురు ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కార్మికులు పేర్కొన్నారు. జూన్ 2 తెలంగాణ స్వాతంత్య్ర దినోత్సవం లాగా అనిపిస్తోందని పేర్కొంటున్నారు. సొంత రాష్ట్ర వికాసంలో కీలక భూమిక పోషించేందుకు సిద్ధంగా ఉన్నామని చెబుతున్నారు. తెలంగాణ రాష్ట్రంలో అందుకునే మొదటి వేతనాన్ని తెలంగాణ అమరవీరుల కుటుంబాలకు, రాష్ట్ర వికాసానికి విరాళంగా అందిస్తామని కొందరు ఉద్యోగులు గర్వంగా తెలుపుతున్నారు. బంగారు తెలంగాణకు పునరంకితం సమైక్య రాష్ట్రంలో ఆఖరి వేతనం అందుకోవడం భవిష్యత్‌కు శుభపరిణామం. ఇకనుంచి తెలంగాణ వికాసంలో కీలకభూమిక పోషిస్తాం. అదనపు పని గంటలు, సెలవుదినాల్లో పనిచేసి బంగారు తెలంగాణ నిర్మించుకుంటాం. తెలంగాణ రాష్ట్రంలోని మొదటి నెల వేతనాన్ని రాష్ట్ర పునర్నిర్మాణానికి, తెలంగాణ అమరవీరుల కుటుంబాలకు విరాళంగా అందించేందుకు సిద్ధంగా ఉన్నాం. - సుబేదారి రమేశ్, తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయీస్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు ప్రజల పక్షాన పోరాటం తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణంలో ఉద్యోగుల పాత్ర క్రియాశీలకంగా ఉంటుంది. వివిధ ఉద్యమాల్లో పనిచేసిన అనుభవం మేరకు ప్రజల పక్షాన పోరాడుతాం. జూన్ 2తో ఉమ్మడి రాష్ట్రంతో విముక్తి లభించబోతోంది. ఆర్థిక పరమైన విముక్తి లభించినప్పటికీ తెలంగాణ స్వాతంత్య్రం కోసం ఎదురుచూస్తున్నాం. తెలంగాణలో తీసుకునే మొదటి వేతనంలో కొంతభాగాన్ని అమరవీరుల కుటుంబాలకు సాయంగా అందిస్తా. - ఫయాజ్ అలీ, తెలంగాణ ఉద్యోగుల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి అదనపు పని గంటలు ఆరు దశాబ్దాల ఉద్యమం, ఆత్మత్యాగాల ఫలితంగా సాధించిన ప్రత్యేక రాష్ట్రాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుకుంటాం. అదనపు పని గంటలతో అభివృద్ధిలో కీలక భూమిక పోషిస్తాం. జూన్ 2 తర్వాత ప్రతీ రోజూ కీలకమే. ఆర్థికపరమైన తెగతెంపులు వేగవంతంగా జరిగిపోవడం సంతోషంగా ఉంది. రాష్ట్ర పునర్నిర్మాణంలో అందరం భాగస్వాములం కావాలి. తెలంగాణలో జూన్ నెల వేతనాన్ని అమరవీరుల కుటుంబానికి సాయంగా అందిస్తా. - మర్రి శ్రీనివాస్‌యాదవ్, బీసీ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు -
సమైక్య ‘సారథి’
జనసభలోనే కాదు.. చట్టసభలో సైతం సమైక్య శంఖారావాన్ని పూరించిన ఏకైక నాయకుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి. సాక్షాత్తూ పార్లమెంటులో రాష్ట్రం సమైక్యంగానే ఉండాలంటూ ప్లకార్డు పట్టుకుని వెల్‌లో దూసుకెళ్లారు. మన జాతి, నేల విచ్ఛిన్నాన్ని అడ్డుకునేందుకు చివరిదాకా పోరాడారు. కాంగ్రెస్ స్వార్థ రాజకీయాలను దునుమాడుతూ గల్లీ నుంచి ఢిల్లీ దాకా ఉద్యమానికి ఊపిరి పోశారాయన. అక్రమ కేసులతో జైలులో పెట్టినా సమైక్య రాష్ట్రం కోసం దీక్ష బూనారు. ప్రాణత్యాగానికీ సిద్ధపడ్డారు. బయటికొచ్చాక అలుపెరుగని పోరు సాగించారు. ఢిల్లీలోనూ ‘సమైక్య’ నినాదాన్ని మార్మోగించారు. హైదరాబాద్‌లో ‘శంఖారావం’ పూరించారు. ఆంధ్రప్రదేశ్ పరిరక్షణ ఉద్యమానికి అండగా నిలవాలంటూ దేశంలోని వివిధ పార్టీల అధినేతలను కలిసి విజ్ఞప్తి చేశారు. సమైక్యమన్న మాటకే కట్టుబడి జనహృదయ స్పందనను చాటిన నేత జగన్ మాత్రమే! -
విశాలాంధ్రకు కాబోయే సీఎం జగన్
సంగం, న్యూస్‌లైన్: రాష్ట్రం సమైక్యంగానే ఉంటుందని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి విశాలాంధ్రకు ముఖ్యమంత్రి అవుతారని ఆ పార్టీ సీజీసీ సభ్యుడు, ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. శుక్రవారం ఆత్మకూరు నియోజకవర్గ వైఎస్సార్సీపీ సమన్వయకర్త మేకపాటి గౌతమ్‌రెడ్డి సంగంలో చేస్తున్న పాదయాత్రలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగన్మోహన్రెడ్డి సీఎం కావడం తధ్యమని తెలిసి కాంగ్రెస్, టీడీపీ కుమ్మక్కై ఆయన ప్రభావం తగ్గిందనే దుష్ర్పచారానికి దిగారని విమర్శించారు. ఈ దుష్ర్పచారానికి ఎల్లో మీడియా తన వంతు సాయం చేస్తోందన్నారు. ఈ ప్రచారాన్ని ప్రజలు గాలి మాటలుగా కొట్టిపారవేస్తున్నారని తెలిపారు. తమ కుట్రలు, కుతంత్రాలు పనిచేయకపోవడంతో ఆ రెండు పార్టీలు మరోసారి కుమ్మక్కై గ్రాఫ్ డ్రామా ఆడుతున్నాయన్నారు. వైఎస్సార్ గురించి అవాకులు, చెవాకులు పేలుతున్న నేతల రాజకీయ జీవితం వచ్చే ఎన్నికలతో ముగుస్తుందన్నారు. సమైక్య రాష్ట్రాన్ని సైతం చీల్చేందుకు టీడీపీ, కాంగ్రెస్ పార్టీలు కలిసి పనిచేస్తున్నాయని తెలిపారు. సోనియా రచించిన రాష్ట్ర విభజన నాటకంలో కిరణ్‌కుమార్‌రెడ్డి గొప్పగా నటిస్తున్నారన్నారు. బాబు రెం డు కళ్ల సిద్ధాంతం, టెంకాయ కథలతో విభజనకు సహకరిస్తున్నారని తెలిపారు. లేఖను వెనక్కు తీసుకోమని అడిగితే స్పందించని చం ద్రబాబును సీమాంధ్ర ప్రజలు తరిమికొట్టే రో జులు దగ్గరలోనే ఉన్నాయన్నారు. అసెంబ్లీలో సమైక్యాంధ్ర కోసం వైఎస్సార్సీపీ ఒక్కటే పోరాడుతుందన్నారు. తమ పోరాటంతోనే సమైక్యాంధ్ర నినాదం నిలబడిందన్నారు. పార్లమెంటులో బిల్లు వస్తే అక్కడ నెగ్గకుండా చేయాలని అన్ని పార్టీల నేతలను తమపార్టీ అధినేత జగన్మోహన్రెడ్డి కలిసి మద్దతు కూడగట్టారని తెలిపారు. మహానేత వెఎస్సార్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల ఫలాలు ప్రజలకు అందడంలేదన్నారు. జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి అయిన క్షణం నుంచి మహానేత వైఎస్సార్ ప్రవేశపెట్టిన పథకాలన్నీ సక్రమంగా అందేలా చర్యలు తీసుకుంటారని తెలిపారు. ఆత్మకూరు నియోజకవర్గంలో తన కుమారుడు గౌతమ్‌రెడ్డి చేస్తున్న పాదయాత్రకు వస్తున్న స్పందన చూస్తుంటే తండ్రిగా తనకు ఎంతో సంతోషంగా ఉందన్నారు. పాదయాత్రలో భాగంగా ప్రజలను కలిసినప్పుడు వచ్చే ఎన్నికల్లో మా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డేనని చెబుతున్నారని తెలిపారు. యువకులు, మహిళలు, వృద్ధులతో పాటు అన్ని వర్గాల ప్రజలు చూపుతున్న ఆదరణ తాను ఎ ప్పటికీ మరిచిపోనని తెలిపారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ, వైఎస్సార్సీపీ సీఈసీ సభ్యుడు బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డి, మర్రిపాడు నాయకులు బిజివేములు వెంకటసుబ్బరెడ్డి, సంగం, ఆత్మకూరు మండలాల వైఎస్సార్సీపీ కన్వీన్వర్లు డాక్టర్ ఐవీ కృష్ణారెడ్డి, ఇందూరు నారసింహారెడ్డి, సంగం నాయకులు వాసుదేవరెడ్డి, మదన్‌మోహన్‌రెడ్డి, నారసింహారెడ్డి, జనార్దన్ రెడ్డి, నజీర్, నయీంమున్నీసా, మల్లికార్జునరెడ్డి, సురేంద్రరెడ్డి, రేవూరు గోపాల్‌రెడ్డి, వనిపెంట వెంకటసుబ్బారెడ్డి, ఎస్వీ రమణరెడ్డి, యర్రబల్లి శంకర్‌రెడ్డి, భాస్కర్‌రెడ్డి, వెంకటేశ్వర్లు, చిట్టిబాబు, రామచంద్రారెడ్డి పాల్గొన్నారు. -
మండే గుండెల తరపున సమైక్య శంఖారావ సభ
-
రాష్ట్రవిభజన ప్రక్రియ ఆపేందుకు ప్రయత్నిస్తున్నాం
-
సమన్యాయమా..సమైక్యమా...
ఒంగోలు, న్యూస్‌లైన్ :రాష్ట్రాన్ని విభజిస్తే రెండు ప్రాంతాల ప్రజలకు సమన్యాయం జరిగేలా ఉండాలని, లేకుంటే సమైక్యంగానే ఉంచాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కన్వీనర్ నూకసాని బాలాజీ డిమాండ్ చేశారు. ఇదే డిమాండ్‌తో వైఎస్ఆర్ సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి జైల్లో చేపట్టిన ఆమరణ నిరాహారదీక్షకు మద్దతుగా ఆ పార్టీ విద్యార్థి విభాగం జిల్లా కన్వీనర్ స్వర్ణ రవీంద్రబాబు స్థానిక చర్చిసెంటర్లో చేపట్టిన ఆమరణ నిరాహారదీక్ష శిబిరాన్ని సోమవారం ఉదయం ఆయన ప్రారంభించారు. ముందుగా జగన్ దీక్షకు మద్దతుగా స్థానిక లాయర్‌పేటలోని వైఎస్ఆర్ సీపీ జిల్లా కార్యాలయం నుంచి చర్చిసెంటర్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం అక్కడ మానవహారంగా ఏర్పాటై నాలుగువైపులా వాహనాల రాకపోకలను సుమారు గంటపాటు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా నూకసాని బాలాజీ మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విధానాల వల్ల రాష్ట్రం అగ్నిగుండంలా మారిందన్నారు. ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర విభజన ప్రక్రియను ఎలా నిర్వహించాలనే దానిపై యూపీఏకు కనీస అవగాహన లేకపోవడం శోచనీయమన్నారు. అలాంటివేమీ తెలియకుండా కేవలం స్వార్థ రాజకీయాల కోసం రాష్ట్ర విభజన నిర్ణయాన్ని ప్రకటించి రాష్ట్ర ప్రజల మనోభావాలతో చెలగాటమాడుతున్నారని మండిపడ్డారు. పార్టీ జిల్లా అధికార ప్రతినిధి బత్తుల బ్రహ్మానందరెడ్డి మాట్లాడుతూ చంద్రబాబు రెండుకళ్ల సిద్దాంతం కారణంగా రాష్ట్రంలో అశాంతి నెలకొందన్నారు. ప్రధాన ప్రతిపక్ష నేతగా ఉన్న ఆయన.. ప్రజల పక్షాన నిలవకుండా గోడమీద పిల్లిలాగా వ్యవహరించడం సిగ్గుచేటన్నారు. చివరకు కాంగ్రెస్‌తో చేతులు కలపడం దుర్మార్గమైన చ ర్యని దుయ్యబట్టారు. వారందరి స్వార్థ రాజకీయాలను ఎండగట్టి ప్రజలందరికీ సమన్యాయం కోసం పోరాడేందుకే వైఎస్ఆర్ సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి జైల్లో ఉన్నప్పటికీ ఆమరణ నిరాహారదీక్ష చేపట్టారని వివరించారు. ఇది మనందరం గర్వించ దగ్గ విషయమన్నారు. రాష్ర్ట విభజన వల్ల సీమాంధ్ర ప్రాంతంలోని అన్నివర్గాలు, అన్నిరంగాల వారితో పాటు విద్యార్థులకు సైతం తీవ్ర నష్టం జరుగుతుందని బత్తుల పేర్కొన్నారు. అయినప్పటికీ ఇక్కడి కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు పట్టించుకోకుండా పదవులు పట్టుకుని వేలాడుతున్నారని, వారందరికీ తగిన బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. పార్లమెంట్లో సస్పెండ్ అయ్యామనిపించుకుని కొందరు ఎంపీలు ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని, వారి నాటకాలను తిప్పికొట్టాలని సూచించారు. పార్టీ నగర కన్వీనర్ కుప్పం ప్రసాద్ మాట్లాడుతూ సమైక్యాంధ్ర ఉద్యమంలో ప్రతిఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. జగన్ దీక్ష కు మద్దతుగా ఉద్యమించాలన్నారు. ముందుగా జగన్ దీక్షకు మద్దతుగా స్వర్ణ రవీంద్రబాబు చేపట్టిన ఆమరణ నిరాహారదీక్ష శిబిరంలో ఏర్పాటు చేసిన మహానేత వైఎస్ఆర్ విగ్రహానికి నాయకులంతా పూలమాలలు వేసి నివాళులర్పించారు. రవీంద్రబాబుకు పూలమాల వేసి అభినందించారు. కార్యక్రమానికి అధ్యక్షత వహించిన బత్తుల బ్రహ్మానందరెడ్డితో పాటు నూకసాని బాలాజీ, పార్టీ వై.పాలెం నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే పాలపర్తి డేవిడ్‌రాజు, యువజన విభాగం జిల్లా కన్వీనర్ కేవీ రమణారెడ్డి, దీక్ష చేపట్టిన రవీంద్రబాబు తదితరులు దీక్షనుద్దేశించి మాట్లాడారు. రవీంద్రబాబు దీక్షను ఆదర్శంగా తీసుకుని జిల్లావ్యాప్తంగా పార్టీ శ్రేణులు దీక్షలు చేపట్టాలని పిలుపునిచ్చారు. రాష్ట్రాన్ని రెండుగా విభజిస్తే లాభాలు లేకపోగా నష్టాలు ఎక్కువగా ఉన్నాయని పేర్కొన్నారు. నిరుద్యోగ సమస్య జటిలమవుతుందని తెలిపారు. అందువల్ల సమైక్యాంధ్ర ఉద్యమంలో విద్యార్థులు కీలకపాత్ర పోషించాలని సూచించారు. రవీంద్రబాబుతో పాటు విద్యార్థులు రాజశేఖరరెడ్డి, శ్రీనివాస్ తదితరులు దీక్షలో కూర్చోగా అధిక సంఖ్యలో విద్యార్థులు, నాయకులు సంఘీభావం ప్రకటించారు. ఆయా కార్యక్రమాల్లో వైఎస్ఆర్ సీపీ గిద్దలూరు నియోజకవర్గ సమన్వయకర్త వై.వెంకటేశ్వరరావు, జిల్లా అధికార ప్రతినిధులు కొఠారి రామచంద్రరావు, నరాల రమణారెడ్డి, ప్రచార విభాగం జిల్లా కన్వీనర్ వేమూరి సూర్యనారాయణ (బుజ్జి), యువజన విభాగం జిల్లా అధికార ప్రతినిధి చిన్నపురెడ్డి అశోక్‌రెడ్డి, నగర అధికార ప్రతినిధి రొండా అంజిరెడ్డి, కేవీ ప్రసాద్, కఠారి శంకర్, బీ కొండలరావు, యరజర్ల రమేష్‌భాబు, నాయకులు చుండూరి రవి, సింగరాజు వెంకట్రావు, డీ అంజిరెడ్డి, ఎస్వీ రమణయ్య, టీ సోమశేఖర్, జాలయ్య, మాజీ కౌన్సిలర్ వెలనాటి మాధవరావు, కత్తినేని రామకృష్ణారెడ్డి, ఎస్వీ రమణయ్య, కావూరి సుశీల, బడుగు ఇందిర, రాజేశ్వరి పాల్గొన్నారు.