ఎల్‌జీ పాలిమర్స్‌ పుట్టుక గురించి.. | Visakhapatnam Gas Leakage: LG Polymers History | Sakshi
Sakshi News home page

ఎల్‌జీ పాలిమర్స్‌ పుట్టుక గురించి..

May 7 2020 10:10 AM | Updated on May 7 2020 2:37 PM

Visakhapatnam Gas Leakage: LG Polymers History - Sakshi

సాక్షి, విశాఖపట్నం: విశాఖపట్నంలో సమీపంలోని ఆర్ఆర్ వెంకటాపురంలో గల ఎల్‌జీ పాలిమర్స్‌ ఘటన రాష్ట్రం మొత్తాన్ని ఉలిక్కిపడేలా చేసింది. ఈ కంపెనీ నుంచి వెలువడిన విషవాయువుల కారణంగా చుట్టుప​క్కల 5 కిలో మీటర్ల పరిధిలోని గ్రామాల ప్రజలు తీవ్ర అస్వస్థతకు లోనయ్యారు. ఫ్యాక్టరీ నుంచి లీకైన స్టెర్లిన్‌ గ్యాస్‌ బాగా ఘాటుగా ఉండటంతో.. కళ్లలో మంటలు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులతో స్థానికులు ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఎదుర్కొన్నారు. చాలామంది రోడ్లపైకి వచ్చి పడిపోవడంతో అక్కడి పరిస్థితి భయానకంగా మారిపోయింది. రాష్ట్రం మొత్తాన్ని దిగ్భ్రాంతికి గురిచేసిన ఈ ఘటనకు కారణమైన ఎల్‌జీ పాలిమర్స్‌ గురించి తెలుసుకుందాం.

ఎల్‌జీ పాలిమర్స్‌ పుట్టుక ఇదే..
హిందుస్తాన్‌ పాలిమర్స్‌ పేరుతో 1961లో ఈ కంపెనీ ప్రారంభించారు. 1978లో దీనిని యూబీ గ్రూప్‌ తీసుకుంది. 1997 జులైలో దక్షిణకొరియాకు చెందిన ఎల్‌జీ గ్రూప్‌(ఎల్‌జీ కెమికల్స్‌) తీసుకుని ఎల్‌జీ పాలిమర్స్‌గా మార్చింది. థర్మాకోల్‌ లాంటివి ఇందులో తయారు చేస్తారు. లాక్‌డౌన్‌ మినహాయింపుల్లో పరిశ్రమలకు అనుమతి ఇవ్వడంతో దీనిని తిరిగి ప్రారంభించారు. ప్రారంభించిన ఒక్క రోజులోనే ఈ గ్యాస్‌ లీకేజీ ఘటన జరిగింది. ఈ ఘటనలో మృతుల సంఖ్య ఆరుకు చేరుకుంది. 

చదవండి:
విశాఖకు రానున్న సీఎం వైఎస్‌ జగన్‌
విశాఖ ఎల్‌జీ పాలిమర్స్‌లో భారీ ప్రమాదం

Advertisement
 
Advertisement
Advertisement