Vizag GAS Leak: ఏంటిదా గ్యాస్‌.. పీల్చితే ఏమవుతుంది? | What Was The GAS Leaked in Vizag? | How Does it Affect The Body?, in Telugu - Sakshi
Sakshi News home page

లీకైన గ్యాస్‌ చాలా ప్రమాదకరం: నిపుణులు

May 7 2020 11:38 AM | Updated on May 7 2020 6:02 PM

Visakhapatnam Gas Leak: Sterin Gas Very Impact On Public - Sakshi

సాక్షి, విశాఖపట్నం: విశాఖపట్నంలో అర్థరాత్రి జరిగిన విషవాయువు దుర్ఘటన అందరినీ దిగ్భ్రాంతికి గురిచేసింది. స్థానిక ఎల్‌జీ పాలిమర్స్‌ నుంచి ప్రమాదవశాత్తు లీకైన విషవాయువు పీల్చి చుట్టుపక్కల ఉండే ప్రజలు తీవ్ర అస్వస్థతకు లోనయ్యారు. ఈ విషవాయువు పీల్చి అనేకమంది రోడ్లపైకి వచ్చి భయానక స్థితిలో పడిపోయి ఉన్నారు. అయితే ఆ ఫ్యాక్టరీ నుంచి లీకైన గ్యాస్‌ చాలా ప్రమాదకరమైదని నిపుణులు పేర్కొంటున్నారు. ఆ గ్యాస్‌ ఏంటిది? పీల్చితే ఏమవుతుందని విషయంపై పలువురు నిపుణులు తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. 

‘ఎల్‌జీ పాలిమర్స్ కంపెనీనుంచి లీకైన గ్యాస్‌ను పీవీసీ గ్యాస్‌ లేక స్టెరిన్‌ గ్యాస్‌ అంటారు. సింథటిక్‌ రబ్బర్‌, ప్లాస్టిక్‌, డిస్పోసబుల్‌ కప్పులు, కంటైనర్లు, ఇన్సులేషన్‌..ఇలా పలు ఉత్పత్తుల్లో ఉపయోగిస్తారు. స్టెరిన్‌ గ్యాస్‌కు రంగు వుండదు. తీయటి వాసన వుంటుంది. రెండు నుంచి మూడు కిలోమీటర్ల వరకు  దాని ప్రభావం వుంటుంది. లీకైన క్షణాల్లోనే మనుషులపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. వెంటనే బాధితుడికి చికిత్స అందకపోతే ప్రాణాలను కూడా పోతాయి. గ్యాస్‌ను పీల్చగానే క్షణాల్లో చర్మంపై దద్దుర్లు పుడతాయి. 

కంటిచూపుపై ప్రభావం చూపిస్తుంది. తలనొప్పి, కడుపులో వికారానికి దారి తీస్తుంది. శ్వాస పీల్చుకోవడం కష్టమై.. బాధితుడు ఉక్కిరిబిక్కిరై పోతాడు. ఊపిరి అందక విలవిలలాడిపోతాడు. స్టిరీన్‌ గ్యాస్‌ పశు పక్ష్యాదులపై సైతం తీవ్ర ప్రభావం చూపిస్తుంది. గ్యాస్‌ లీకైన ప్రాంతంలో చెట్లు కూడా నల్లగా మారిపోతాయి’ అంటూ నిపుణులు పేర్కొంటున్నారు. 

డాక్టర్లు సూచిస్తున్న జాగ్రత్తలు..
► వీలైనంత ఎక్కువ మంచినీళ్లు తాగండి: డాక్టర్లు
► తప్పనిసరిగా మాస్క్‌/తడి గుడ్డ ధరించండి
► ఇంట్లో ఉన్నా సరే మాస్క్‌ తప్పనిసరి
► కళ్ల మంట అనిపిస్తే ఐ డ్రాప్స్‌ వేసుకోవాలి
► నీరసంగా అనిపిస్తే సిట్రిజన్‌ టాబ్లెట్‌ వేసుకోవాలి
► వాంతి వచ్చినట్టు అనిపిస్తే డోమ్‌స్టల్‌ టాబ్లెట్‌ వేసుకోండి
► గ్యాస్‌ ప్రభావం తగ్గించడానికి కొద్దిగా పాలు తాగండి
► పాలిమర్స్‌ గ్యాస్‌ ప్రభావం 48 గంటలు ఉంటుంది
► వచ్చే రెండు రోజులు ఇంట్లోనే ఉండండి

(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

చదవండి:
మృత్యుపాశమై వెంటాడిన విషవాయువు
విశాఖ ఎల్‌జీ పాలిమర్స్‌లో భారీ ప్రమాదం
సీఎం జగన్‌కు ప్రధాని మోదీ ఫోన్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement