కీచక ఉపాధ్యాయుడిపై నిరసనల వెల్లువ | Villagers protests on Teacher | Sakshi
Sakshi News home page

కీచక ఉపాధ్యాయుడిపై నిరసనల వెల్లువ

Nov 6 2013 4:11 AM | Updated on Sep 2 2017 12:18 AM

విద్యార్థినికి మాయ మాటలు చెప్పి గర్భవతిని చేసిన రామాపురం ఉన్నత పాఠశాల ఉపాధ్యాయుడి ఉదంతంపై గ్రామంలో తీవ్ర నిరసన వెల్లువెత్తింది.

చిలుకూరు, న్యూస్‌లైన్: విద్యార్థినికి మాయ మాటలు చెప్పి గర్భవతిని చేసిన రామాపురం ఉన్నత పాఠశాల ఉపాధ్యాయుడి ఉదంతంపై గ్రామంలో తీవ్ర నిరసన వెల్లువెత్తింది. మంగళవారం ఉదయం ‘సాక్షి’లో వార్తను చూసిన గ్రామస్తులు పాఠశాల వద్దకు చేరుకుని ఆందోళనకు దిగారు. పాఠశాలకు వచ్చిన ఉపాధ్యాయులను లోనికి వెళ్లకుండా గేటు వద్ద అడ్డుకున్నారు. ఈ సందర్భంగా పలువురు గ్రామస్తులు మాట్లాడుతూ కీచక పీఈటీ విజయ్‌కుమార్‌ను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. విద్యార్థి సంఘాల నాయకులు, విద్యార్థులు పాఠశాలకు చేరుకుని ఆందోళనకు దిగారు. కాగా, మంగళవారం పాఠశాలకు సెలవు ప్రకటించారు.
 మండల కేంద్రంలో రాస్తారోకో
 కీచక ఉపాధ్యాయుడిని కఠినంగా శిక్షించాలని కోరుతూ చిలుకూరులో ఏఐఎస్‌ఎఫ్,  టీఎన్‌ఎస్‌ఎఫ్, బీసీఎస్‌ఎఫ్, జీవీఎస్, బీసీ విద్యార్థి సంఘం, టీఆర్‌ఎల్‌డీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థి సంఘం, మైనార్టీ సంఘాల ఆధ్వర్యంలో  కోదాడ-హుజూర్‌నగర్ రోడ్డుపై రాస్తారోకో నిర్వహించారు. ఉపాధ్యాయుడిపై నిర్భయ చట్టం కింద కేసునమోదు చేయాలని వారు డిమాండ్ చేశారు. ధర్నాలో చేపూరి కొండలు, నజీర్,  సంగారపు ప్రసాద్, వావిళ్ల రమేష్‌గౌ డ్,  బాబు,  బాలునాయక్ తదితరులు పాల్గొన్నారు. విద్యార్థినిని వంచించిన పీఈ టీని కఠినంగా శిక్షించాలని  వివిధ ఉపాధ్యాయ సంఘాలు వేర్వేరు ప్రకటనల్లో కోరాయి. అదే విధంగా ఉపాధ్యాయుడిని వెంటనే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని కోరుతూ బీజేపీ నాయకులు చిలుకూరు తహసీల్దార్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు.

Advertisement
 
Advertisement
Advertisement