అనారోగ్యం కారణంగానే.. | Teacher Commits Suicide Due To Mental Illness Nizamabad District Crime | Sakshi
Sakshi News home page

అనారోగ్యం కారణంగానే..

Jun 26 2026 2:19 PM | Updated on Jun 26 2026 2:28 PM

Teacher Commits Suicide Due To Mental Illness Nizamabad District Crime

కామారెడ్డి: జిల్లా కేంద్రంలోని నర్సన్నపల్లి సమీపంలో ఉన్న ఓ ప్రయివేటు పాఠశాలలో పని చేసేందుకు 10 రోజుల క్రితం కామారెడ్డికి వచ్చిన కేరళ టీచర్‌ దేవిక ఉల్లాస్‌ (25) బుధవారం ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే. ఆమె ఆత్మహత్యపై అనేక అనుమానాలు తలెత్తాయి. మృతురాలి తల్లి డాలీ కేరళ నుంచి గురువారం కామారెడ్డికి చేరుకున్నారు.

దేవిక ఉల్లాస్‌ కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ మనస్తాపానికి గురయ్యేదని, అందుకే ఆత్మహత్య చేసుకొని ఉంటుందని ఫిర్యాదు చేశారు. దీంతో ఆమె ఆత్మహత్యకు అనారోగ్యమే కారణమని దేవునిపల్లి పోలీసులు నిర్ధారించారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అప్పగించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement